చిరంజీవి వరస సినిమాలతో బిజీగాబిజీగా గడపడమే కాదు.. సమంత ఆహా టాక్ షో సామ్ జామ్ కోసం చాలా స్టైలిష్ గా రెడీ అయ్యాడు. చిరు మేకోవర్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులోనూ సూపర్ ఫిట్ నెస్ తో చిరు అదరగొడుతున్నాడని అంటున్నారు. నిన్నటినుండి ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి తదుపరి చిత్రాన్ని మెహెర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేస్తున్నాడు. ఆచర్య తర్వాత వేదాళం రీమేక్ షూట్ లో పాల్గొనబోతున్న చిరు తదుపరి చిత్రాలు కూడా సెట్ అయ్యాయి. మలయాళంలో భారీ హిట్ కొట్టిన లూసిఫెర్ ని చిరు రీమేక్ చెయ్యాలనుకున్నాడు.
ముందు లూసిఫెర్ రీమేక్ బాధ్యతలను సాహో డైరెక్టర్ సుజిత్ కి అప్పజెప్పగా.. సుజిత్ లూసిఫెర్ రీమేక్ స్క్రిప్ట్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడంతో లూసిఫర్ నుండి సుజిత్ ని తప్పించి ఆ బాధ్యతలను వినాయక్ కి అప్పజెజెప్పాడు చిరు. వినాయక్ కూడా లూసిఫర్ స్క్రిప్ట్ లో సెకండ్ హాఫ్ విషయంలో తర్జనభర్జనలు జరగడం, ఇతర కారణాలతో ఇప్పుడు వినాయక్ కూడా లూసిఫెర్ రీమేక్ నుండి తప్పించి.. మరో దర్శకుడికి ఆ రీమేక్ బాధ్యతలు అప్పజెప్పినట్టుగా టాక్. చిరు లూసిఫర్ కోసం ఈసారి తమిళ దర్శకుడు దిగబోతున్నాడట.
తమిళ హిట్ సినిమాలతో ఫెమస్ అయిన దర్శకుడు మోహన్ రాజా రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలను తిరుగుతుంటే.. అనూహ్యంగా చరణ్ తండ్రి చిరు లూసిఫెర్ బాధ్యతలను మోహన్ రాజా కి అప్పజెప్పినట్టుగా ఫిలిం నగర్ టాక్. దానితో మోహన్ రాజా లూసిఫెర్ రీమేక్ స్రిప్ట్ వర్క్ ని మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే చిరు తో లూసిఫర్ పూర్తయ్యాక తనతో సినిమా చేస్తానని మోహన్ రాజా కి చరణ్ మాటిచ్చినట్టుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.