Advertisementt

యండమూరి- చిరు బెస్ట్ ఫ్రెండ్స్... మరి గొడవేమిటి?

Sun 22nd Nov 2020 10:26 AM
yandamoori,chiranjeevi,sensational comments  యండమూరి- చిరు బెస్ట్ ఫ్రెండ్స్... మరి గొడవేమిటి?
Telugu Novelist's Sensational Comments On Chiru యండమూరి- చిరు బెస్ట్ ఫ్రెండ్స్... మరి గొడవేమిటి?
Advertisement
Ads by CJ

నవలా రచయిత యండమూరి వీరేంద్ర నాధ్.. చిరంజీవికి కి మనస్ఫర్ధలున్నాయని.. యండమూరి ఒకసారి రామ్ చరణ్ ని అవమానించేలా మాట్లాడాడని, మెగా ఫాన్స్ ఫైర్ అవడమే కాదు... ఈ విషయంలో నాగబాబు కూడా ఫైర్ అయ్యాడు. ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిన చిరు - యండమూరి తర్వాతర్వాత శత్రువులుగా మారిపోయారని అంటుంటారు. యండమూరి నవల్స్ ని సినిమాలుగా చేసి చిరు చాలానే హిట్స్ కొట్టాడు. అయితే తాజాగా చిరు - యండమూరి గొడవ విషయంపై యండమూరి క్లారిటీ ఇచ్చాడు. తాను చిరు మృగరాజు సినిమా చేస్తున్నప్పుడు చిరు ని కలిసి తన కొడుకు పెళ్లికి ఫైనాన్షియల్ హెల్ప్ చెయ్యమని అడిగితే.. దానికి చిరు ఆ సినిమాని నిర్మిస్తున్న నాగబాబు దగ్గరకి వెళ్ళమ్మని చెప్పారు. అప్పుడు నేను నాగబాబుగారిని కలిసి మృగరాజు సినిమాకి మాట సహాయం చెయ్యగా నాగబాబు తనకు నాలుగు లక్షలు ఇవ్వగా.. వాటితో కొడుకు పెళ్లి చేసానని చెబుతున్నాడు.

అంతేకాకుండా చిరంజీవికి రాజకీయాలు సరిపడవని, ఆయన వ్యక్తిత్వానికి రాజకీయాలను సెట్ కావని.... ఆ విషయమే ఆయనకి చెప్పా అని, కానీ చిరు గారు రాజకీయపార్టీ పెట్టి ఓ సభ ఏర్పాటు చేసి మాట్లాడుతుండగా.. అది ఓ ఛానల్ లో ప్రసారమవుతున్న వేళ నేను వేరే ఛానల్ లో చిరంజీవి రాజకీయాలకు సరిపడవని, అందులో ఆయన సక్సెస్ కారనే చర్చలో పాల్గొన్నానని ఆ విషయం తెలిసిన చిరంజీవి నొచ్చుకున్నారని.. అప్పుడే కాస్త అపార్ధాలు చోటు చేసుకున్నాయి కానీ మా మధ్యన మరే అపార్ధాలు లేవంటూ చిరు - యండమూరి గొడవలకి క్లారిటీ ఇచ్చాడు యండమూరి.  

Telugu Novelist's Sensational Comments On Chiru:

Yandamoori On Fall Out With Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ