Advertisementt

బిగ్ బాస్ 4: డేంజర్ జోన్ లో టాప్ 2 కంటెస్టెంట్?

Sat 21st Nov 2020 12:41 PM
bigg boss,elimineted,lasya,monal,11th week  బిగ్ బాస్ 4: డేంజర్ జోన్ లో టాప్ 2 కంటెస్టెంట్?
Top 2 contestant in Danger Zone? బిగ్ బాస్ 4: డేంజర్ జోన్ లో టాప్ 2 కంటెస్టెంట్?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 4 చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు వారాల గేమ్ మాత్రమే మిగిలి ఉంది. గత రెండు రోజులుగా హౌస్ ఎమోషన్స్ తార స్థాయిలో ఉన్నాయి. బిగ్ బాస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ తమ కుటుంబ సభ్యుల్ని కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో అఖిల్, అభిజిత్, హరికలు ఉండగా.. వారు కెప్టెన్ అవ్వాలంటే హౌస్ మేట్స్ లో మూగ్గురు సభ్యులు వీరిని భుజాల మీద ఎత్తుకుని చివరి వరకు మొయ్యాల్సి ఉంటుంది. సోహైల్ అఖిల్ ని భుజాల మీద ఎక్కించుకోగా.. అవినాష్ అభిజిత్ ని, హారికాని మోనాల్ భుజాల మీద ఎత్తుకున్నారు. మరి ఈ ఆటలో ఫైనల్ గా అఖిల్ మరోసారి కెప్టెన్ అయ్యేలాగే కనబడుతున్నాడు.

ఇక గత నాలుగు వారాలుగా బిగ్ బాస్ మోనాల్ ని సేవ్ చెయ్యడం కోసం హౌస్ మేట్స్ లో మెహబూబ్, కుమార్ సాయి లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ని బలి చేసింది అంటూ సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్. అయితే ఈసారి బిగ్ బాస్ మోనాల్ ని సేవ్ చెయ్యడం లేదు.. అంటే నామినేషన్స్ లో ఉన్న మోనాల్ ఈసారి ఓట్స్ పరంగా బెటర్ పోస్జిషన్ లో ఉందట. ఓట్స్ పరంగా అభి ఎప్పటిలాగే టాప్ లో ఉండగా.. తర్వాత సోహైల్, తర్వాత హారిక.. ఆ తర్వాత అరియనా, మోనాల్ ఉంటే.. చివరి ప్లేస్ లో లాస్య ఉన్నట్టుగా సోషల్ మీడియా ప్రచారం. టాప్ 2 లో అభిజిత్, లాస్య లు ఉంటారని అంచనాలు ఉన్న టైం లో ఇలా లాస్య లాస్ట్ ప్లేస్ లో ఉండడం ఆమె అభిమానులకు షాకిచ్చింది. 

మరి బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటినుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా సోషల్ మీడియాలో ఓట్స్ విషయంలో బలంగా ఉన్న లాస్య అనూహ్యంగా చివరి ప్లేస్ కి రావడం.. మోనాల్ లాస్య కన్నా బెటర్ పొజిషన్ లో ఉండడం అనేది ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్ధంకాని ప్రశ్న. ఎప్పుడూ బిగ్ బాస్ సేవ్ చేస్తున్న మోనాల్ ని ఈసారి ప్రేక్షకులు సేవ్ చేసేలా కనబడుతుంది వ్యవహారం. మరి మోనాల్ కోసం ఈసారి లాస్య బలవుతుందా? లేదంటే లాస్య కి బిగ్ బాస్ ప్రేక్షకులే షాకిస్తారా అనేది ఆదివారం ఎపిసోడ్ లో క్లారిటీ వస్తుంది. 

Top 2 contestant in Danger Zone?:

Telugu Bigg boss 4 11th week voting polls result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ