Advertisementt

పుష్పరాజ్ విలనా? హీరోనా?

Sat 21st Nov 2020 11:11 AM
allu arjun,pushpa,rustic look,sukumar  పుష్పరాజ్ విలనా? హీరోనా?
Allu Arjun's Raw and Rugged Look Rocks పుష్పరాజ్ విలనా? హీరోనా?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లో అల్లు అర్జున్ కల్డ్ మాస్ లుక్ మాములుగా లేదు. మాస్ గా అల్లు అర్జున్ పుష్ప లుక్ కి అందరూ ఆశ్చర్యపోయారు. ఏడునెలల కరోనా టైం లోను అల్లు అర్జున్ పుష్ప మేకోవర్ లోనే ఉన్నాడు. అందుకే సినిమా షూటింగ్ మొదలవ్వగానే స్టయిల్ కోసం, మేకోవర్ కోసం టైం వెస్ట్ అనకుండా అల్లు అర్జున్ రంగంలోకి దిగిపోయాడు. పుష్ప సినిమా షూటింగ్ లో పుష్ప రాజ్ బ్యాక్ లుక్ మొన్నామధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్టైలిష్ హీరో, అందమైన హీరో, ఇలా మాస్ లుక్ లో చూడగానే అందరూ అబ్బా పుష్ప కి అల్లు అర్జున్ మేకోవర్ సూపర్ అన్నారు.

తాజాగా పుష్ప లొకేషన్స్ లో అల్లు అర్జున్ లుక్ చూస్తుంటే అసలు పుష్ప రాజ్ విలనా? హీరోనా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ మాసిన బట్టలతో.. మాస్ గా కాదు బాబోయ్ ఊర మాస్ గా రఫ్ గా కనిపిస్తున్నాడు. అలా చూసిన వారు అల్లు అర్జున్ నెగెటివ్ గా కనిపిస్తాడేమో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ అంత మాస్ గా ఉన్నాడంటే.. అల్లు అర్జున్ పాత్ర పుష్ప లో ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే అనుమానాలు వస్తున్నాయి. లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రని సుకుమార్ వేరే లెవల్లో డిజైన్ చేసాడని మాత్రం అర్ధమవుతుంది.

Allu Arjun's Raw and Rugged Look Rocks:

Allu Arjun Lives in His Role with This Rustic Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ