పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే కలను పింక్ రీమేక్ తో తీర్చుకుంటున్న దిల్ రాజు.. పవన్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన వాడు( వకీల్ సాబ్ షూటింగ్ - ఏపీ రాజకీయాల కోసం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ ని ఆరెంజ్ చెయ్యడం లాంటివి) ఇప్పుడు వకీల్ సాబ్ రిలీజ్ డేట్ విషయంలో ఎందుకింత కామ్ అయ్యాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. కానీ పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అనగానే చాలామంది ఓ క్లారిటీకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ అందరికన్నా వెనకాలే వకీల్ సాబ్ షూటింగ్ మొదలు పెట్టాడు. పవన్ ఎప్పడు షూటింగ్ కి వస్తాడో, ఎప్పుడు రాజకీయాలంటాడో అర్ధం కాదు. మధ్యలో నాగబాబు కూతురు పెళ్లి ఒకటి. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో పవన్ జనసేన పోటీ. ఇవన్నీ చూసిన దిల్ రాజు ఒకటే ఫిక్స్ అయ్యాడంటున్నారు.
అదేమిటంటే ముందు పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చెయ్యనివ్వండి అప్పుడు రిలీజ్ డేట్ విషయం ప్రకటిద్దాం. లేదంటే వకీల్ సాబ్ ఏ సంక్రాంతికో అని ప్రకటించాక పవన్ గ్రేటర్ ఎన్నికలతోను, అన్న కూతురు పెళ్లి విషయంలో షూటింగ్ కి గ్యాప్ తీసుకుంటే అనవసరంగా ఇరుక్కోవాలి. ముందు ఎన్నికలు, నిహారిక పెళ్లి పూర్తయ్యాక, వకీల్ సాబ్ షూటింగ్ కూడా ప్యాకప్ చెప్పాకే సినిమా కి డేట్ ఎనౌన్స్ చేద్దామని దిల్ రాజు అనుకోబట్టే.. సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ జరుగుతున్నా దిల్ రాజు ప్రస్తుతం వకీల్ సాబ్ విషయంలో కామ్ గా ఉండడానికి కారణమంటున్నారు.