పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యడం అంటే మాములు విషయం కాదని అజ్ఞాతవాసి తర్వాత చాలామంది నిర్మతలకి అర్ధమైంది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ తో సినిమాలు చేసేందుకు కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వగా.. పవన్ ఆ అడ్వాన్స్ లు తీసుకుని రాజకీయాల్లోకి చెక్కేసి మళ్ళీ ఈ ఏడాది వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన పవన్ తో సినిమాలు చేసందుకు నిర్మాతలు దర్శకులు క్యూ కట్టారు. దానితో పవన్ చేతిలో నాలుగు సినిమాలు వచ్చి పడ్డాయి. ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో క్లారిటీ లేని పవన్ తో నాలుగు నిర్మాతలు సినిమాలు నిర్మించడానికి రెడీ అయ్యారు. వరసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు కదా పవన్ సినిమాలు చేసుకుంటాడనుకుంటే.. ఇప్పుడు తెలంగాణ జి చ్ఎంసీ ఎన్నికల్లో వేలు పెట్టాడు.
మరో 10 రోజుల్లో వకీల్ సాబ్ షూటింగ్ చుట్టేద్దామనుకున్న దర్శకనిర్మాతలకు ఈ దెబ్బకి టెంక్షన్ మొదలయ్యింది. డిసెంబర్ నాలుగు వరకు పవన్ ఈ గ్రేటర్ ఎన్నికల హడావిడిలోనే ఉంటాడు. డిసెంబర్ నాలుగు తర్వాత అయినా ఫ్రీ అయ్యి షూటింగ్స్ కి వస్తాడనుకుంటే.. మళ్ళీ అన్న కూతురు నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ వెళ్ళాలి. దాని కోసం ఓ వారం రోజులు పడుతుంది. మరి వకీల్ సాబ్ షూట్ ఫినిష్ అయ్యాక.. క్రిష్ సినిమా కోసం పది రోజుల డేట్స్ కేటాయించిన పవన్ తర్వాత అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మొదలెట్టాలనే ప్లాన్ లో ఉంటే.. ఇప్పుడు ఈ ఎన్నికలు, అన్న కూతురి పెళ్లి తో పవన్ లాక్ అవడంతో నిర్మాతలకు చమట్లు పడుతున్నాయి. ఒకపక్క కరోనాతో లాస్.. మరోపక్క పవన్ తో పెట్టుకుంటే ఇంతే అంటూ తలలు పట్టుకుంటున్నారట.