Advertisementt

ఈసారి రాజమౌళి మాట నిలబెట్టుకోవడం ఖాయం!!

Wed 18th Nov 2020 10:28 PM
rrr,rajamouli,ram charan,ntr,midnight shoot  ఈసారి రాజమౌళి మాట నిలబెట్టుకోవడం ఖాయం!!
RRR team Shiver in Cold Amid Night Shoot ఈసారి రాజమౌళి మాట నిలబెట్టుకోవడం ఖాయం!!
Advertisement
Ads by CJ

రాజమౌళి ఎప్పుడూ మాట తప్పుతాడు.. తమ హీరోలకు సంబందించిన లుక్స్ విషయంలోనూ, సినిమాల విడుదల తేదీల విషయంలో ఇచ్చిన మాటకు నిలబడడు అంటూ హీరోల ఫాన్స్ ఎప్పుడూ జక్కన్నపై ప్రేమతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. మొన్నటికి మొన్న RRR సినిమాలో రామ్ చరణ్ అల్లూరి వీడియో ని రామ్ చరణ్ పుట్టిన రోజుకి వదిలి మెగా ఫాన్స్ ని కూల్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్ విషయంలో మోసం చేసాడు. కారణం కరోనా అయినా ఎన్టీఆర్ ఫాన్స్ రాజమౌళి మీదే పడ్డారు. రాజమౌళి మాత్రం RRR షూటింగ్ మొదలవ్వగానే వన్ వీక్ లో ఎన్టీఆర్ వీడియో ఇస్తా అన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఇక మరోసారి జక్కన్న మాట మీద నిలబడడం ఖాయం అనిపిస్తుంది.

ఎందుకంటే కరోనా వలన ఆగిన RRR షూటింగ్ ఈ మధ్యనే మొదలయ్యింది. RRR షూటింగ్ మొదలైనప్పటినుండి రాజమౌళి హీరోలతోను, టెక్నీకల్ టీం తో రాత్రిపగలు పని చేయిస్తున్నాడు. అలాగే RRR మేకింగ్ గ్లిమ్బ్స్ తో రాజమౌళి ఆయన టీం కష్టాన్ని షేర్ చేస్తున్న టీం తాజాగా విడుదల చేసిన వీడియోలో చలికి గజగజ ఒణుకుతున్న RRR టీం అండ్ హీరో ఎన్టీఆర్ అందరూ అర్ధవరాత్రి వరకు RRR షూటింగ్ కోసం సమయం వెచ్చిస్తున్నారు. చలి పులి నగరాన్ని వణికిస్తున్న నేపథ్యంలో RRR టీం చలికి వణుకుతూనే షూటింగ్ పూర్తి చేస్తున్నారు. 

రాజమౌళి RRR షూటింగ్ ని ఇలా రాత్రిపగలు కష్టపడి ఫినిష్ చేసి ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఓ కొలిక్కి తెస్తాడని.. తరవాత పోస్ట్ ప్రొడక్షన్ పని, గ్రాఫిక్స్ పనులకి మరో మూడు నెలలు టైం కేటాయించి.. వేసవి చివరికల్లా RRR ని ప్రేక్షకుల ముందుకు తెచ్చినా  తేవచ్చు.. ఈ విషయంలో ఈసారి రాజమౌళి ని నమ్మొచ్చు అంటున్నారు చరణ్ అండ్ ఎన్టీఆర్ అభిమానులు.

RRR team Shiver in Cold Amid Night Shoot:

RRR Video goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ