Advertisementt

బెల్లంకొండ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సుజిత్?

Wed 18th Nov 2020 06:51 PM
sujeeth,bellamkonda srinvas,hindi debut  బెల్లంకొండ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సుజిత్?
Saaho Director Sujeeth Set For Directorial Debut in Bollywood ? బెల్లంకొండ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సుజిత్?
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీనివాస్ - సంతోష్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని... రాజమౌళి - ప్రభాస్ హిట్ మూవీ ఛత్రపతికి శ్రీనివాస్ బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నాడనే న్యూస్ ప్రచారంలో ఉంది. బెల్లంకొండ యాక్షన్ మూవీస్ బాలీవుడ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంటాయి. ఆ కాన్ఫిడెన్స్ తోనే శ్రీనివాస్ బాలీవుడ్ లో డైరెక్ట్ యాక్షన్ మూవీ చెయ్యాలని ఫిక్స్ అయినట్లున్నాడు. ఇక ఎప్పుడో వచ్చిన ఛత్రపతి సినిమా ని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యడానికి భారీ మార్పులే జరుగుతున్నాయట.

తెలుగు ఛత్రపతి హిందీ ప్రేక్షకులకు నచ్చేలా.. అక్కడి నేటివిటీకి దగ్గరగా, యాక్షన్ ని హైలెట్ చేస్తూ మార్పులు చేర్పులు జారుతున్నాయని చెబుతుంటే.... ఇప్పుడు హిందీ లో ఈ రీమేక్ చెయ్యబోయే డైరెక్టర్ పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా మూవీ చేసిన సుజిత్ బెల్లకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఏర్పాట్లు మొదలైనట్టుగా టాక్. ప్రభాస్ సాహో యాక్షన్ కి హిందీ ప్రేక్షకులు ఫిదా అవడంతో ఇప్పుడు ఛత్రపతి ని ఓ యాక్షన్ రీమేక్ గా తెరకెక్కించడానికి సుజిత్ ని ఎంపిక చేసినట్టుగా సమాచారం.

Saaho Director Sujeeth Set For Directorial Debut in Bollywood ?:

Sujeeth May Direct Bellamkonda srinvas Hindi Debut

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ