Advertisementt

ఆఫర్స్ వదులుకున్నప్పుడు మానసిక పోరాటం చేశా!!

Wed 18th Nov 2020 05:12 PM
ritu varma,pelli choopulu,vikram,dhruva nakshatram,dulkar,kanulu kanulanu dochayanate  ఆఫర్స్ వదులుకున్నప్పుడు మానసిక పోరాటం చేశా!!
Did a mental fight when I dropped the offers!! ఆఫర్స్ వదులుకున్నప్పుడు మానసిక పోరాటం చేశా!!
Advertisement
Ads by CJ

చాలామంది హీరోయిన్స్.. వచ్చిన అవకాశాలను వదులుకోరు. చిన్న అవకాశం అయినా, పెద్ద అవకాశం అయినా వదులుకోవడానికి సిద్దపడరు. ఒకవేళ వదులుకోవాల్సి వస్తే చాలా గట్స్ ఉండాలి. అంటే హీరోయిన్ గా పేరు కావాలంటే మంచి అవకాశాలకు ఓకె చెప్పాలి. పర్లేదు ఎలా ఉన్న హీరోయిన్ గా డజను సినిమాలు చెయ్యాలనుకుంటే ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పాలి. అయితే పెళ్లి చూపులు హీరోయిన్ తాను అవకాశాలు అవదులుకున్నప్పుడు మానసికంగా ఎంతో పోరాటం చేశా అని చెబుతుంది. పెళ్లి చూపులతో పలు అవార్డులు అందుకున్న రీతూ వర్మ ఆ సినిమా తర్వాత అదే తరహా పాత్రలను, అలాగే మసాలా పాత్రలను మొహమాటం పడకుండా వద్దని చెప్పేశా. అప్పటినుండి మనసుకు నచ్చిన సినిమాలను ఒప్పుకుంటూ వచ్చానని చెబుతుంది.

అవకాశాలు వద్దనుకున్నప్పుడు.. అమ్మో ఒక్క సినిమాకే ఫెడవుట్ అవుతానేమో అని భయపడ్డాను. అలాగే నటిగా పరిణితి చెందాక కథ నచ్చక పోయినా, పాత్ర నచ్చకపోయినా చెయ్యను అని ఈజీగా చెబుతున్నాను, కానీ పెళ్లి చూపులు టైం లో ఆఫర్స్ వదులుకున్నప్పుడు మానసికంగా పెద్ద పోరాటం చెయ్యాల్సి వచ్చింది అని చెబుతుంది రీతూ వర్మ. ఇక తమిళనాట విక్రమ్ తో అవకాశం అనగానే ఆనందపడ్డాను. గౌతమ్ మీనన్ గారి ధ్రువ నచ్చత్రం సినిమాలో విక్రమ్ సరసన నటించడం హ్యాపీ.. కానీ ఆ సినిమా కోసం రెండేళ్లు మరే సినిమాకి సైన్ చెయ్యలేకపోయాను. 

అయితే ఆ సినిమా విడుదల ఆలస్యం వలన కాస్త బాధగా ఉంటుంది. ఇక మలయాళంలో దుల్కర్ సల్మాన్ సరసన కనులు కనులను దోచాయంటే సినిమాలో అవకాశం రావడం.. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చెయ్యడం కొత్తగా ఉంది. హీరోయిన్ విలన్ పాత్ర చెయ్యడం వేరు.. హీరోయిన్ హైటెక్ దొంగగా మారి డబ్బు కొట్టెయ్యడం వేరు. ఆ పాత్రలో ఛాలెంజ్ ఉందనిపించింది. ఆ సినిమాలోనూ పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది. అలంటి పాత్ర చేసాక ఈ హీరోయిన్ ఎలాంటి పాత్రకైనా సూటవుతుంది అని దర్శకనిర్మాతలు ఓ అంచనాలు వచ్చారంటూ ముగించింది.

Did a mental fight when I dropped the offers!!:

Ritu Varma about her recent movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ