పవన్ కళ్యాణ్ కి మూడొచ్చింది.. ఇటు సినిమా షూటింగ్, అటు రాజకీయాలు.. రెండూ మొదలు పెట్టాడు. కరోనా కారణంగా ఏడు నెలలు ఇంట్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా వకీల్ సాబ్ షూటింగ్ తో పాటుగా రాజకీయాల్లోనూ బిజీ అయ్యాడు. నిన్నటివరకు థియేటర్స్ బంద్ కారణంగా సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయి.. రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చెయ్యలేక.. చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ముచ్చట దిల్ రాజు మరిచిపోయినట్టుగా ఉన్నాడు. లేదంటే వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడో ఇచ్చేసేవాడే. ప్రస్తుతం మీడియం, చిన్న హీరోలే సంక్రాంతికి టార్గెట్ చేస్తూ విడుదల డేట్స్ ప్రకటించాయి.
కానీ పవన్ - దిల్ రాజు లు మాత్రం గమ్మునుంటున్నారు. వకీల్ సాబ్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే పవన్ ఫాన్స్ మాత్రం సంక్రాంతికి వకీల్ సాబ్ పక్కా అనుకుంటూన్నారు. కానీ తాజాగా పవన్ సంక్రాంతి వద్దు... ఏప్రిల్ లో సినిమాని విడుదల చేద్దాం.. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ చేసినా 50 శాతం అక్యుపెన్సీతో వర్కౌట్ ఎవ్వడు.. అలాగే ప్రేక్షకులు సినిమాని 100 శాతం ఎంజాయ్ చెయ్యలేరు. అదే ఏప్రిల్ అయితే ఆరామ్స్ గా ఉంటుంది. అప్పటికి కరోనా తగ్గి థియేటర్స్ పై ఫుల్ క్లారిటీ ఉంటుంది.. సో అప్పుడు వకీల్ సాబ్ ని విడుదల చేద్దామని దిల్ రాజుకి పవన్ చెప్పినట్టుగా ఫిలింనగర్ టాక్.