ఆచార్య షూటింగ్ మొదలయ్యే సమయానికి చిరంజీవి కరోనా అంటూ హోమ్ క్వారంటైన్ కి వెళ్లడంతో ఆచార్య షూటింగ్ షెడ్యూల్ మొత్తం తారుమారైంది. కొరటాల అయితే చిరు లేకపోయినా ఆచార్య షూటింగ్ ని మొదలుపెట్టాడు. అయితే కొరటాల ఆచార్య షూటింగ్ మొదలు పెట్టిన కొన్ని గంటల్లోనే చిరంజీవికి కరోనా లేదని.. ఆయనకి ఫాల్టి కిట్స్ వలన కరోనా వచ్చి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి కానీ.. అసలైతే చిరుకి కరోనా సోకలేదు.. మూడు టెస్ట్ ల అనంతరం చిరుకి మూడు టెస్ట్ లు నెగెటివ్స్ వచ్చేసాయి.. హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకున్న కొరటాలకి ఇంకా టెంక్షన్ తీరలేదట.
చిరుకి కరోనా లేదు.. ఆచార్య షూటింగ్ కి వచ్చేస్తాడని కొరటాల కళలు కన్నాడు. కానీ చిరు కి కరోనా లేకపోయినా.. ఆయన ఇప్పుడప్పుడే ఆచార్య షూటింగ్ సెట్స్ కి రాలేరని.. ప్రస్తుతం చిరు హోమ్ క్వారన్టైన్ లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. కరోనా లేదు.. ఆచర్య షూటింగ్ చేసుకుందాము, చిరు వచ్చేస్తున్నారు అనుకున్న కొరటాలకి మళ్ళీ టెంక్షన్ మొదలైందట. అసలు చిరు లేని సీన్స్ ని తెరకెక్కిచాలంటే ముందు ప్లాన్ ఉండాలి. కానీ కరోనా కొరటాల ప్లాన్స్ ని తల్లకిందులు చేసింది. మరి చిరుకి కరోనా లేదు.. షూటింగ్ సెట్స్ కే వచ్చేస్తాడని ఆశపడిన కొరటాల ఆశల మీద చిరు క్వారంటైన్ నీళ్లు చల్లినట్టైంది.