పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్నాడు. పవన్ వకీల్ సాబ్ తదుపరి చిత్ర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వకీల్ సాబ్ తర్వాత పవన్ క్రిష్ సినిమా కోసం ఓ పది రోజులపాటు వెచ్చించి.. తర్వాత శేఖర్ కె చంద్ర తో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కి జంప్ అవుతాడట. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన శేఖర్ కె చంద్ర పవన్ తో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ తో పవన్ ని మెప్పించి ఆ సినిమా చెయ్యడానికి ప్లాన్ చేసాడు. శేఖర్ కె చంద్ర పవన్ తో ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళదామా అని ఎదురు చూస్తున్నాడట. డైరెక్టర్ శేఖర్ కె చంద్ర తాను పవన్ తో సినిమా చెయ్యడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నా అని అంటున్నాడు.
పవన్ కళ్యాణ్ గారితో సినిమా చెయ్యడం కోసం ఓ అభిమానిగా ఎదురు చూస్తున్నా అని, అలాగే అయ్యప్పన్ కోషియమ్ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశామని, ఈ సినిమాలో ఉండే ఇంపార్టెన్స్ రోల్స్ ని అందరికి నచ్చేలా డిజైన్ చేశామని, పవన్ ఫాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా చేస్తానంటూ చెబుతున్నాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా పవన్ ని ఎలా చూపించాలో తనకో ఐడియా ఉందని అంటున్నాడు. మరి అభిమాని అంటున్న శేఖర్ పవన్ హీరోయిజాన్ని ఎంతవరకు చూపిస్తాడో చూడాలి.