Advertisementt

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...!!

Mon 16th Nov 2020 11:24 AM
bigg boss 4,mehaboob dilse,eliminated,nagarjuna,bigg boss leaks  బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...!!
Mehaboob eliminated from Bigg boss 4 బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...!!
Advertisement
Ads by CJ

గత రాత్రి బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున యాంకరింగ్ ఓకె అన్నప్పటికీ... హౌస్ లో డ్రామా మాములుగా లేదు. అఖిల్ ని ఎలిమినేట్ చేస్తున్నామంటూ ప్రమోస్ తో హడావిడి చేసిన స్టార్ మా... నాగార్జున తోనూ సీరియస్ కామెడీ చేయించింది. నాగ్ అయితే కోపంగా అఖిల్ తో ప్యాక్ యువర్ బాగ్స్ అంటూ అరిచేసాడు. కానీ చివరిలో ఎప్పటిలాగే ప్రేక్షకులను ఫూల్స్ చేసాడు. గత వారం సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ బిల్డప్ ఇచ్చింది బిగ్ బాస్ యాజమాన్యం.. అది రేటింగ్ పెంచుకోవడానికి అలా డ్రామా చేసారని బిగ్ బాస్ ప్రేక్షకులు సమాధానపడ్డారు. కానీ దివాళి ఎపిసోడ్ లో ప్రత్యేకత ఏమైనా ఉంటుందా అంటే.. అఖిల్ ఎలిమినేషన్ డ్రామా తప్ప మరొకటి లేదు. అఖిల్ ఎక్కడ హౌస్ నుండి వెళిపోతాడో అనుకున్న సోహైల్, మోనాల్ బిగ్గరగా ఏడవడం చిరాకు తెప్పించింది అంటున్నారు నెటిజెన్స్. అఖిల్ కూడా ఓవరేక్షన్ చేస్తూ.. మమ్మి అంటూ ఏడవడం.. అబ్బో బిగ్ బాస్ అంతా మెమోషనల్ డ్రామా అయ్యింది. 

ఇక నామినేషన్స్ లో ఉన్న అభిజిత్ ని ఫస్ట్ సేవ్ చెయ్యగా.... ఈ రోజు హౌస్ నుండి బయటికి వెళ్ళబోయేది మెహబూబ్ అని... ఇప్పటికే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యి నాగ్ తో స్టేజ్ మీదకొచ్చిన  ఎపిసోడ్ షూట్ పూర్తయినట్లుగా లీకుల వీరులు లీకులు మొదలెట్టేసారు. గత కొన్ని వారాలుగా మోనాల్ ని నామినేట్ చెయ్యడమే కాదు... ఆమెని ఎలిమినేట్ చెయ్యడానికి బిగ్ బాస్ ప్రేక్షకులు శత విధాలుగా ప్రయత్నిస్తున్నా.. బిగ్ బాస్ మోనాల్ ని కాపాడుకుంటుంది. ఇక మెహబూబ్ విషయంలోనూ అదే జరిగింది. బిగ్ బాస్ కావాలనే మెహబూబ్ ని ఎలిమినేట్ చెయ్యకుండా కాపాడుతున్నాడంటూ బిగ్ బాస్ మీద ఏసుకుంటున్నారు. అయితే నేడు ఆదివారం ఎపిసోడ్ లో మెహబూబ్ ఎలిమినేట్ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో బిగ్ బాస్ లీకులు షురూ అయ్యాయి.

Mehaboob eliminated from Bigg boss 4:

Bigg Boss 4: Mehaboob dil se Eliminated this week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ