Advertisementt

ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబో హీరోయిన్ ఆమేనా?

Sun 15th Nov 2020 06:40 PM
keerthy suresh,ntr,trivikram  ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబో హీరోయిన్ ఆమేనా?
Keerthy Suresh To Romance NTR? ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబో హీరోయిన్ ఆమేనా?
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ RRR సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ. కరోనా తో కాలం వృధా అవడంతో.. హీరో రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరు రాజమౌళికి 100% సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా దివాళి స్పెషల్ విషెస్ చెప్పడానికి ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి తో కలిసి స్పెషల్ ఫోటో షూట్ తో కేక పుట్టించారు. ఇక ఎన్టీఆర్ RRR ఫినిష్ కాగానే త్రివిక్రమ్ మూవీకి జంప్ అవుతాడు. RRR తో పాటె త్రివిక్రమ్ షూటింగ్ అనుకున్నా.. ఇప్పుడు RRR షూట్ ఫినిష్ చెయ్యడం ముఖ్యం కాబట్టి త్రివిక్రమ్ సినిమాని ఎన్టీఆర్ పక్కనపెట్టాల్సి వచ్చింది. RRR షూటింగ్ అవడమే తరువాయి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం లుక్ మార్చేస్తాడు.

అయితే ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్, పూజ హెగ్డే ని హీరోయిన్ గా ఫైనల్ చేసాడు అని.. సెకండ్ హీరోయిన్ గా సమంతని అనుకుంటున్నాడంటూ  ప్రచారం జరుగుతుంటే.. తాజాగా ఎన్టీఆర్ సరసన మహానటి నటించే అవకాశం ఉంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ ఎన్టీఆర్ సినిమాలో కూడా నటించబోతుందని.. లుక్ పరంగా ట్రోల్స్ ఎదుర్కుంటున్న కీర్తి సురేష్ మళ్ళీ బరువు పెరుగతానంటూ స్టేట్మెంట్ ఇచ్చాక త్రివిక్రమ్ చూపు కీర్తి పై పడినట్లుగా టాక్. మరి ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్ నటించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లు ప్రచారం అయితే షురూ అయ్యింది. 

Keerthy Suresh To Romance NTR?:

Keerthy suresh in Ntr -Trivikram combo?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ