Advertisementt

బోర్.. బోర్.. బిగ్ బాస్!!

Sun 15th Nov 2020 06:37 PM
bigg boss,nagarjuna,diwali episod,naga chaithanya  బోర్.. బోర్.. బిగ్ బాస్!!
Bigg boss Boring in Week days బోర్.. బోర్.. బిగ్ బాస్!!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 రెండు వారాల నుండి తెగ బోర్ కొట్టిస్తుంది. కంటెస్టెంట్స్ లో ఉత్సాహం లేదు.. అఖిల్ ని తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో పెట్టి.. అడ్డమైన టాస్క్ లు చూపిస్తున్నాడు బిగ్ బాస్. హౌస్ లో ప్రేమ పక్షులు విడిపోయాయి. ఒకరు హౌస్ లో, ఒకరు సీక్రెట్ రూమ్ లో. మరోపక్క అవినాష్ అరియనా తో పులిహార కలిపే ప్రోగ్రాం పెడుతున్నాడు. మధ్యలో బాగా కలిసిపోయిన అభిజిత్ - హరికలు ఇప్పుడు అంతగా కలిసున్నట్టుగా కన్పించడం లేదు. టాస్క్ పెరఫార్మెన్సెస్  వీక్. అబ్బబ్బ వీక్ డేస్ మొత్తం బిగ్ బాస్ సుత్తి ప్రోగ్రాం అంటూ ప్రేక్షకుల పెదవి విరుపులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఈ రోజు దీపావళి ఎపిసోడ్ ని నాగార్జున వేరే లెవెల్ లో ప్లాన్ చేసారని అంటున్నారు. ఓ అరగంట పాటు కొడుకు చైతు తో కలిసి నాగ్ దీపావళి ఎపిసోడ్ లో కనిపించబోతున్నాడంటూ టాక్. చైతు తో కలిసి ఫన్ పండించబోతున్నాడని.. ఈ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అభిజిత్, సోహైల్, మెహబూబ్, అరియనా, మోనాల్, హరికలలో హారిక కి టాప్ ఓట్స్ రాగా అరియనా, మెహబూబ్ డేంజర్ జోన్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి వారాంతం సో సో గా ఉంటున్న బిగ్ బాస్ వీక్ డేస్ లో మరీ బోర్ గా మారిపోయింది. ఐపీఎల్ అయ్యిపోయింది.. ఇప్పుడైనా టీఆర్పీ పెంచుకోవడానికి ఆసక్తికర టాస్క్ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే ఓకె లేదంటే.. స్టార్ మా కి కష్టం.

Bigg boss Boring in Week days:

No content from Bigg boss season 4

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ