Advertisementt

మోహన్‌ బాబుని అవమానించారని అంటున్నారు

Sun 15th Nov 2020 11:49 AM
mohan babu,suriya,aakaasam nee haddhu ra  మోహన్‌ బాబుని అవమానించారని అంటున్నారు
No importance to Mohan Babu in Aakaasam Nee Haddhu Ra మోహన్‌ బాబుని అవమానించారని అంటున్నారు
Advertisement
Ads by CJ

తమిళనాట సూర్య హీరో గా సుధా కొంగర తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుండి ఆకాశం నీ హద్దురా టాక్ సోషల్ మీడియాని కమ్మేసింది. సూర్య నటన కి దర్శకత్వ ప్రతిభ తోడైతే హిట్ అవక ఇంకేం అవుతుంది. ఆకాశం నీ హద్దురా సినిమాకి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టాక్ పడింది. కొన్నాళ్లుగా సో సో సినిమాలతో మెప్పించలేకపోతున్న సూర్య కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అయితే ఈ సినిమలో తెలుగు సీనియర్ హీరో మోహన్ బాబు భక్తవత్సలం నాయుడు పాత్రలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించాడు.

మరి మోహన్ బాబు లాంటి సీనియర్ హీరో, అందులోను క్రేజ్ ఉన్న మోహన్ బాబు ఆకాశం నీ హద్దురా సినిమాలో నటిస్తున్నాడంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. కానీ సినిమా చూసాక కానీ అసలు విషయం అర్ధం కాలేదు. అంటే ఆకాశం నీ హద్దురా సినిమాలో సూర్య కి బాస్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కేవలం మూడు సీన్స్ కే పరిమితం చేసారు. మరి మోహన్ బాబు కి ఇది అవమానమే. అలాంటి పాత్రని మోహన్ బాబు ఎలా ఒప్పుకున్నాడో ఎవరికి అర్ధం కాలేదు. మోహన్ బాబు కి ఇంకొన్ని సీన్స్ ని యాడ్ చేసిఉంటే బావుండేదని ఆయన అభిమానుల అభిప్రయం. మరి అందుకేనేమో మోహన్ బాబు ఆకాశం నీ హద్దు రా కి పెద్దగా ప్రమోషన్ చెయ్యకుండా సైలెంట్ గా ఉన్నాడు.

No importance to Mohan Babu in Aakaasam Nee Haddhu Ra:

Only 3 scenes to Mohan Babu in Suriya Aakaasam Nee Haddhu Ra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ