Advertisementt

భారతీయుడు 2 పక్కనెట్టి.. పెళ్లిపనుల్లో శంకర్

Sat 14th Nov 2020 12:19 PM
director shankar,indian 2,daughter marriage  భారతీయుడు 2 పక్కనెట్టి.. పెళ్లిపనుల్లో శంకర్
Indian 2 shelved.. Shankar busy with personal work భారతీయుడు 2 పక్కనెట్టి.. పెళ్లిపనుల్లో శంకర్
Advertisement
Ads by CJ

ఈమధ్యన భారతీయుడు 2 విషయంలో దర్శకుడు శంకర్ బాగా హైలెట్ అయ్యాడు. భారతీయుడు 2 షూటింగ్ విషయం ఆలోచించాలంటూ నిర్మాతలకు లేఖ రాసిన శంకర్ కి లైకా పొడక్షన్స్‌ వారు రిప్లయ్‌ ఇవ్వలేదు. దానితో శంకర్ కామ్ అవడంతో భారతీయుడు 2 సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే శంకర్ భారతీయుడు 2 విషయం తేలడం లేదు, అలాగే కమల్ హాసన్ కూడా భారతీయుడు 2 విషయం పట్టించుకోకుండా లోకేష్ కనకరాజ్ తో విక్రమ్ సినిమా, అలాగే బిగ్ బాస్ సీజన్ 4 తో బిజీగా వున్నాడు మధ్యలో మనకెందుకులే అనుకున్న శంకర్ కూడా వేరే ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నాడని అది కూడా కన్నడ హీరో యశ్ తో భారీ మల్టీస్టారర్ మొదలు పెట్టబోతున్నాడనే న్యూస్ కన్నడ సర్కిల్స్ నుండి కోలీవుడ్ సర్కిల్స్ వరకు ప్రచారం లోకొచ్చింది.

అయితే ప్రస్తుతం శంకర్ భారతీయుడు సినిమా గురించి కానీ... లేదా కొత్త ప్రాజెక్ట్ గురించి కానీ ఆలోచించడం లేదట. ఎందుకంటే శంకర్ ప్రస్తుతం బాగా బిజీగా ఉన్నాడట. ఆయన బిజీ అయ్యింది సినిమాల్లో కాదు పర్సనల్ లైఫ్ లో. అదేమిటంటే శంకర్ తన కూతురు పెళ్లి విషయంలో బాగా బిజీ అయ్యాడట. చిన్న కూతురు అదితి శంకర్ పెళ్లి పనుల్లో శంకర్ తలమునకలై ఉన్నాడని అంటున్నారు. మరి సినిమాల్లోనే భారీ విజువల్స్, భారీ సెట్టింగ్స్ తో అదరగొట్టే శంకర్ రియల్ లైఫ్ లో కూతురు పెళ్లికి ఎంత గ్రాండ్ గా ఏర్పాట్లు చెయ్యబోతున్నాడో అనే క్యూరియాసిటీ ఇప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకుల్లోనే కాదు.. అందరిలో ఉంది.

Indian 2 shelved.. Shankar busy with personal work:

No movies.. Director Shankar busy with his daughter wedding

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ