Advertisementt

గెలవడానికి రాలేదు.. ఎక్స్ పీరియెన్స్ కోసం వచ్చా?

Fri 13th Nov 2020 10:09 PM
abhijeeth,bigg boss 3,winner  గెలవడానికి రాలేదు.. ఎక్స్ పీరియెన్స్  కోసం వచ్చా?
Bigg Boss 4: What is Abhijeet Thinking? గెలవడానికి రాలేదు.. ఎక్స్ పీరియెన్స్ కోసం వచ్చా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లోకి వెళ్లిన ప్రతి కంటెస్టెంట్ చివరివరకు గెలవాలనే ఆడతాడు. ప్రతి టాస్క్ లోను బెస్ట్ ఇవ్వాలనే అనుకుంటాడు. కొంతమంది తప్పితే బిగ్ బాస్ గేమ్ ని చాలామంది సీరియస్ గానే తీసుకుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 4 అభిజిత్  అలా కనిపించడం లేదు. టాస్క్ ల పరంగా వీక్ అయిన అభిజిత్.. హౌస్ లో ఇంగ్లీష్ మాట్లాడుతూ పనిషమెంట్స్ తీసుకుంటాడు. చాలావరకు మైండ్ గేమ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో కనబడుతున్న అభిజిత్ కి మోనాల్ విషయంలో తన ఫ్రెండ్ అఖిల్.. అభిజిత్ కి శత్రువులా తయారయ్యాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్.. అభిజిత్ మీద కోపం పెంచుకుంటున్నాడు. 

స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన అఖిల్ బయటికి వెళ్ళేటప్పుడు డిఫెండ్ చేసుకోవాలి కదా అంటూ అభిజిత్ అంటుంటే.. నేను స్ట్రాంగ్ కనకనే నన్ను బయటికి పంపారు అంటున్నాడు అఖిల్. ఇక మధ్యలో అభిజిత్ నేను బిగ్ బాస్ కి గెలవడానికి రాలేదు.. ఎక్స్ పీరియన్స్ కోసం వచ్చాను అన్నాడు. అంటే బిగ్ బాస్ లో అభిజిత్ ఫైనల్ కి వెళ్లినా గెలవను అనే భావనతోనే ఉన్నట్టుగా ఉన్నాడు. కాబట్టే ఇలా నీరసంగా మాట్లాడుతున్నాడు. ఇక అఖిల్ విషయంలోనూ అభిజిత్ అతను ఎందుకు బయటికి వెళ్ళాడు.. అంటే మళ్ళి వస్తాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. 

Bigg Boss 4: What is Abhijeet Thinking?:

Did not come to win .. Came for experience

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ