ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు..

కొట్టిన ట్యూన్లనే కొడుతున్నాడని కొత్తదనం కొరవడిందని కోడై కూసిన సొషల్ మీడియా, ఈ దెబ్బతో తన మాట మార్చుకుంటుందేమో. దేవి కూడా ఓల్డ్ అయిపోయాడా అని అనుమానం వచ్చిన వాళ్లందరికీ తామనుకున్నది తప్పని తెలుసుకునే టైమ్ వచ్చేసిందేమో. ఉప్పెన చిత్రంతో ఈ అనుమానాలన్నింటినీ దేవిశ్రీ ప్రసాద్ బద్దలు కొట్టేలా ఉన్నాడు. పంజా వైష్ణవ్ తేజ్, హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా నుండి తాజాగా రంగులద్దుకున్న అనే పాట రిలీజైంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. సాహిత్య పరంగానూ, సంగీతం పరంగానూ మరో లెవెల్ లో ఉన్న పాట ఉప్పెన సినిమాపై అంచనాలని విపరీతంగా పెంచేసింది. ఎవ్వరికీ కనబడకుండా ప్రపంచంతో దాగుడుమూతలు ఆడుతూ, ప్రేమించుకుంటున్న ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే ఈ పాట ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

అందరూ ఉన్నచోట ఇద్దరవుదాం..ఎవ్వరూ లేని చోట ఒక్కరవుదాం.. ఏ క్షణం విడివిడిగా లేమందాం. మన ఊసు మోసే గాలిని మూటకడదాం.. మన జాడ తెలిపే నేలని పాతిపెడదాం.. సాక్ష్యంగా సంద్రాలు ఉంటే దిగుడు బావిలో దాచి మూతపెడదాం లాంటి లైన్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మొత్తంగా ఉప్పెన పాట పూర్తిగా ఆకర్షిస్తోంది. ఈ దెబ్బతో దేవిశ్రీ ప్రసాద్ లైన్లోకి వచ్చేసినట్టే అని అర్థం అవుతుంది.

Click here for Song

Devi Sri Prasad is back with Uppena..

Devi Sri Prasad is back with Uppena..
ranguladdukunna
uppena
super star mahesh babu
krithi shetty
devi sri prasad
mythri movie makers
sukumar
buchi babu sana
panja vaishnav tej