రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదం. వర్మ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది. అసలు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అంటేనే వర్మ. రామ్ గోపం వర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వర్మ నోట్లో నోరు పెట్టడమంటే ఇక ఫినిష్. అందుకే వర్మ జోలికి వెళ్లాలంటే గట్స్ ఉండాలి. తాజాగా రాజమౌళి వర్మకి మొక్కలు నాటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు. వర్మ మాత్రం నేను చెయ్యను అంటూ మొహమాటం లేకుండా చెప్పేసాడు. మామూలుగానే రాజమౌళి అంటే వర్మకి కాస్త జెలస్. తాజాగా పొలిటిక లీడర్స్ దగ్గరనుండి సినిమా సెలబ్రిటీస్ వరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ మొక్కలు నాటే ప్రోగ్రాం మొదలెట్టారు.
ప్రభాస్ నుండి రామ్ చరణ్ ఈ ఛాలెంజ్ ని స్వీకరించి నాలుగు రోజుల క్రితం మొక్కలు నాటి.. తన ఛాలెంజ్ ని అలియా భట్, RRR టీంకి ఇచ్చాడు. అందులో భాగంగా రాజమౌళి RRR టీం అంతా మొక్కలు నాటి తమ ఛాలెంజ్ ని పూరి, వినాయక్.. వివాదాల వర్మకి విసరగా.. నేను చెయ్యను. నాకు ముట్టుకోవడం అంటే అస్సహ్యం.. మొక్కలు మంచి వాళ్ళే నాటాలి... నేను మొక్కలు నాటి పచ్చదనం పెంచడానికి అనర్హుడిని అంటూ ఏదేదో మాట్లాడి.. చివరికి ఛాలెంజ్ స్వీకరించడం లేదని చెప్పేసాడు. మట్టి అంటే అసహ్యం, ఆసక్తి లేదు అంటూ మంచివాళ్ళకి మాత్రమే మొక్కలు సూటవుతాయి.... మీకు మీ మొక్కలకి ఆల్ ద బెస్ట్ అంటూ వెటకారంగా ట్వీట్ చేసాడు.