Advertisementt

ఆచార్య: కొరటాల సంచలన నిర్ణయం!

Tue 10th Nov 2020 09:43 PM
koratala siva,acharya,sensational decision  ఆచార్య: కొరటాల సంచలన నిర్ణయం!
Acharya Shooting Latest Update ఆచార్య: కొరటాల సంచలన నిర్ణయం!
Advertisement
Ads by CJ

కొరటాల, చిరుతో ఆచార్య మొదలు పెట్టి ఏడాది గడిచిపోయినా.. ఆచార్య షూటింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. కరోనాతో వాయిదా పడిన ఆచార్య షూటింగ్ తిరిగి సోమవారం మొదలైంది. అయితే ఆచార్య సెట్స్ లో అడుగుపెట్టకముందే చిరు కరోనా బారిన పడడంతో ఆచార్య షూటింగ్ ఆగిపోయిందనే అనుకున్నారు. మరి మెయిన్ హీరో చిరుకి బాగోకపోతే టీం మాత్రం షూటింగ్ ఏం చేస్తుందిలే అనుకున్నారు. కానీ చిరుకి కరోనా ఉన్నప్పటికీ... ఎలాంటి లక్షణాలు లేకపోయినా హోమ్ క్వారంటైన్ లో ఉంటే.. కొరటాలకి చాలా కష్టము. అయినప్పటికీ.. కొరటాల నిరుత్సాహపడకుండా మేకర్స్ కలిసి ప్లాన్ చేసి ఆచార్య షూటింగ్ ని యధావిధిగా కానిచ్చేస్తున్నాడట.

చిరు లేని సన్నివేశాలను తెరకెక్కిస్తూ టీం మొత్తం బిజీగా ఉందట. మరి చిరుతో సెట్స్ లో అడుగుపెట్టాలని కొరటాల పక్కా ప్లాన్ చేసుకుంటే చిరుకి కరోనా రావడంతో షాకయిన కొరటాల ముందు కాస్త కంగారు పడినా తేరుకుని.. ప్రొడక్షన్ టీం తో చర్చించి.. చిరు లేని కొన్ని సన్నివేశాలు తెరక్కించాలని ప్లాన్ చేసుకుని కొరటాల రంగంలోకి దిగేశాడట. చిరుకి కరోనా తీవ్రత పెద్దగా లేకపోవడంతో రెండు వారాల హోమ్ క్వారంటైన్ తర్వాత చిరు ఆచార్య సెట్స్ లో జాయిన్ అవుతాడని కొరటాల నమ్మకమట. అందుకే ఆచార్య షూటింగ్ ఆగకుండా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తుంది. మరి చిరు వలన ఆచార్య షూటింగ్ పోస్ట్ పోన్ అయితే.. ఆచార్య రాక మరింత ఆలస్యం అవుతుందని అనుకున్నారు మెగా ఫాన్స్. కానీ ఇప్పుడా దిగులు లేదంటున్నారు.

Acharya Shooting Latest Update:

Koratala Siva takes Sensational Decision about Acharya Shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ