ఎన్టీఆర్‌కి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో రాజీవ్ కనకాల, మనోజ్, రామ్ చరణ్ ఇలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మంచు మనోజ్ అయితే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం అప్పుడు ఎన్టీఆర్‌కి వెన్నంటి నిలబడ్డాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఓ ఫ్రెండ్ గురించి చేసిన ఫన్నీ వ్యాఖ్యలు ఇంట్రస్ట్‌ని కలిగిస్తున్నాయి. అందులోను ఆ ఫ్రెండ్ ఎన్టీఆర్‌ని విపరీతమైన టార్చర్ పెట్టేవాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా షేర్ చేసాడు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు.. మంచు మనోజ్. మనోజ్ - ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్. అయితే మనోజ్ ఎన్టీఆర్‌ని టార్చర్ పెట్టేవాడట. అదెలాగో కూడా ఎన్టీఆర్ ఓ కథలో వివరించాడు.
బ్రహ్మ దేవుడు ఇద్దరు పిల్లలకి రూపాలు వేరైనా.. ఒకేలా ఆలోచించేలా తయారు చేశాడు. అయితే అలాంటి పిల్లల్ని భూమి మీదకి పంపుతూ.. ఒకరిని బుద్ధిమంతుడిగాను, మరొకరిని అల్లరి పిల్లవాడిగానూ తయారు చేశాడు. అయితే బుద్దిగా ఉండే పిల్లాడిని ముందు పంపేసి.. ఆరు గంటలు లేట్ గా అల్లరి పిల్లాడిని భూమి మీదకి పంపాడు. ఆ పిల్లాడి మోహన్ బాబుగారి ఇంట పుట్టి మనోజ్ అయ్యాడు. మనోజ్ నాకంటే ఆరు గంటలు చిన్నవాడైనా అల్లరిలో నన్ను కనీసం పెద్దవాడని కూడా చూడడు. అప్పటినుండి ఇప్పటివరకు మనోజ్ నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు. మనోజ్ నా దగ్గరికి వస్తున్నాడంటే చాలు.. ప్రకృతి నాకు తెలియజేస్తుంది. మనోజ్ చేసే పనులు వలన నేను చాలాసార్లు బుక్ అయ్యాయని.. మనోజ్ గురించి ఫన్నీగా చెప్పేశాడు మన యంగ్ టైగర్.