పపవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ వకీల్ షూటింగ్ యమా జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ సెట్స్‌లో అడుగుపెట్టడమే షూటింగ్‌కి కళ వచ్చింది అంటూ యూనిట్ హుషారుగా పని చేస్తుందట. ఇక పవన్ వకీల్ సాబ్ షూటింగ్ తర్వాత క్రిష్ తో కాకుండా శేఖర్ కె చంద్ర తో అయ్యప్పన్ కోషియం సినిమా చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి అయ్యప్పన్ కోషియం స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండడంతో.. 40 రోజుల డేట్స్‌తో పవన్ కళ్యాణ్ ఆ రీమేక్ కి ఓకే చెప్పాడని.. త్వరలోనే అయ్యప్పన్ కోషియం రీమేక్ సెట్స్ మీదకెళ్లబోతుంది అనే టాక్ ఉండగా..ఈ సినిమాలో నటించబోయే మరో హీరో విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు.
మరి అయ్యప్పన్ కోషియం రీమేక్ లో అయ్యప్పన్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా.. కోషియం పాత్రలో రానా పేరు ప్రముఖంగా వినబడుతుంది. కానీ రానా ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా జాగత్త పడుతూనే తాజాగా పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియం గురించి స్పందించాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఓ పాత్రకి ప్రపోజల్ నా దగ్గరికి వచ్చింది. కానీ అది ఇంకా ఫైనల్ కాలేదు అంటూనే.. ఆ పాత్ర చెయ్యడం నాకు ఇష్టమే అంటూ క్లారిటీ లేని హింట్ ఇచ్చి వదిలాడు రానా. మరి ఫైనల్ గా రానా నే పవన్ కోషియం అవ్వొచ్చని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే ఈగో పాత్రకి రానా పర్ఫెక్ట్ అంటూ పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.