Advertisementt

‘ఆదిపురుష్’కి ఆ హీరోయిన్నే దిక్కవుతుందా?

Thu 12th Nov 2020 09:02 AM
keerthi suresh,prabhas,om raut,aadipurush,heroine  ‘ఆదిపురుష్’కి ఆ హీరోయిన్నే దిక్కవుతుందా?
Is this Heroine only option to Prabhas Aadipurush ‘ఆదిపురుష్’కి ఆ హీరోయిన్నే దిక్కవుతుందా?
Advertisement
Ads by CJ

ప్రభాస్ రాధేశ్యామ్ ఇటలీ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ రావడమే కాదు... హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళాడు. అక్కడ దర్శకుడు ఓంరౌత్‌తో ఆదిపురుష్ కథా చర్చల్లో పాల్గొంటున్నాడు. జనవరి నుండి ఓంరౌత్ - ప్రభాస్‌ల ఆదిపురుష్ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. టీ సీరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఆదిపురుష్ మీద భారీగా అంచనాలే ఉన్నాయి. అయితే ఆదిపురుష్ స్క్రిప్ట్ వర్క్, కథా చర్చలు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అన్ని చివరి దశలో ఉన్నాయి కానీ.. ఇంతవరకు ఆదిపురుష్ హీరోయిన్ అంటే సీత పాత్రకి ఎవరిని సెట్ చెయ్యలేదు దర్శకుడు.

అయితే ప్రభాస్ రాముడి పాత్రలోనూ సీత పాత్రలో సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరు వినిపించినా ప్రస్తుతం ఆమె క్రేజ్ తగ్గడంతో ఓం రౌత్ బాలీవుడ్ భామలనే తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. అందులో ముఖ్యంగా ప్రభాస్ పక్కన టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె అయితే సీత పాత్రకి పర్ఫెక్ట్ అనుకునేలోపు నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం ఆయన సినిమాలోకి దీపికాని ఎంపిక చేసి ఓం రౌత్‌కే షాకిచ్చాడు. ఇక కియారా అద్వానీ, ప్రభాస్ సరసన సీత అంటున్నారు కానీ.. ఆమెకి డేట్స్ ప్రాబ్లెమ్. ఈ హీరోయిన్ విషయంలో ఓం రౌత్ ప్రభాస్ సలహాలను పరిగణనలోకి తీసుకుంటున్నాడని టాక్ ఉంది. మరి చివరికీ ఎవరూ సెట్ కాకపోతే సీతగా ఓం రౌత్.. కీర్తిని ఫైనల్ చేసేలా ఉన్నాడని అంటున్నారు. 

Is this Heroine only option to Prabhas Aadipurush:

Keerthi Suresh Only Option to Prabhas Aadipurush From South

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ