మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల చేసి మరో రెండు నెలలకి ఏడాది పూర్తవుతుంది. కానీ మహేష్ కొత్త సినిమా ఇంకా లేట్ అవుతూనే ఉంది. కరోనా కారణం ఒకటైతే.. సర్కారు వారి పాట యూనిట్ సభ్యుల వీసా ఒక కారణంగా మారింది. నిన్నమొన్నటివరకు వీసా ప్రోబ్లెంస్ ఫేస్ చేసిన టీం కి ఇప్పుడు ఆ బాధ లేదు. ఇక తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో అమెరికా ఫ్లైట్ ఎక్కేసాడు. ఏలాగు సర్కారు వారి పాట షూటింగ్ ముందుగా అమెరికా షెడ్యూల్ తో దర్శకుడు పరశురామ్ మొదలు పెట్టబోతున్నాడు.
అందుకే అన్ని కలిసొచ్చేలా మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని అంటే కొడుకు గౌతమ్, కూతురు సితార, భార్య నమ్రతతో సహా అమెరికాలో వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఎలాగూ అమెరికాలో ఓ 45 రోజుల భారీ షెడ్యూల్ సర్కారు వారి పాటకు ఉండబోతుంది. ఇక ఒక పక్క షూటింగ్, మరోపక్క ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడం.. మహేష్ ప్లానింగ్ సూపర్. మరి మహేష్ ఫ్యామిలీతో పాటుగా అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు ఓకే.. మరి సర్కారు వారి పాట యూనిట్ ఎప్పుడు అమెరికా వెళుతుందో.. అసలు సర్కారు వారి పాట షూటింగ్ అప్పుడు, ఇప్పుడు అనే ప్రకటన ఇవ్వకుండా టీమ్ ఇంకా నాన్చుతూనే ఉంది. మహేష్ లగేజ్ సర్దుకుని ఫ్లైట్ ఎక్కాడు కాబట్టి.. దీపావళి తర్వాత సర్కారు వారి పాట టీమ్ కూడా అమెరికా ప్రయాణం పడుతుందేమో చూడాలి.