Advertisementt

కరోనాతో చచ్చిపోతానని అనుకున్నా: తమన్నా!

Thu 12th Nov 2020 08:58 AM
tamannaah bhatia,scared,sick,weak,tamanna,corona,heavy weight  కరోనాతో చచ్చిపోతానని అనుకున్నా: తమన్నా!
I am scared with corona says Tamanna కరోనాతో చచ్చిపోతానని అనుకున్నా: తమన్నా!
Advertisement
Ads by CJ

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ఎలాంటి జబ్బులు లేని ఆరోగ్యంగా ఉన్న వారికీ కరోనా సోకినా నష్టం లేదు. కానీ ఇతర జబ్బులున్న వాళ్ళకి కరోనా సోకితే చాలా కష్టపడాలి. ఇక కరోనాకి పేద, ధనిక అనే భేదం లేదు. సినిమా ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నవారు ఉన్నారు.. రేర్ గా ప్రాణాలు వదిలినవారు ఉన్నారు. మొన్న మధ్యన సినిమా షూటింగ్స్ కి రెడీ అవుతున్న తరుణంలో హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడి హాస్పిటల్ పాలయ్యింది. అయితే తాజాగా కరోనాని జయించిన తమన్నా.. కరోనా సోకిన టైం లో తన మైండ్ సెట్ మొత్తం మారిపోయింది అని.. కరోనా కారణంగా చచ్చిపోతానేమో అనే మరణానికి సంబంధించిన ఆలోచనలతో గడిపాను అని అంటుంది. కరోనా సోకినప్పుడు భయపడ్డాను. ఎందుకంటే కరోనా తీవ్రత నాలో ఎక్కువగా కనబడింది.

 

అప్పుడే నాకు చచ్చిపోతానేమో అనే ఆలోచనలు భయపెట్టాయి.. కానీ డాక్టర్స్ నన్ను బ్రతికించారు. అప్పుడే నాకు జీవితం ఎంతో విలువైంది అని తెలియడమే కాదు.. నాకు అలాంటి కష్ట సమయంలో సపోర్ట్ చేసిన నా పేరెంట్స్ కి ఎప్పటికి రుణపడి ఉంటాను అంటుంది తమన్నా. అలాగే కరోనా కారణముగా నేను వాడిన మెడిసిన్ వలన నేను కొద్దిగా లావయ్యాను. కరోనా నుండి కోలుకుని ఓ ఫోటో షూట్ చేయించుకుని దాన్ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. మీరు కొంచెం లావయ్యారు అంటూ నా అభిమాని ఒకరు నన్ను కామెంట్ చేసారు. అసలు అవతలి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది చూడకుండా ఇలాంటి కామెంట్స్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తానెందుకు లావయ్యానో కారణాలు చెప్పింది తమన్నా.

I am scared with corona says Tamanna:

At covid time I was so sick, weak and scared.. says Tamannaah Bhatia 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ