Advertisementt

ప్రైవేట్ ఫ్లైట్‌లో పనులు చక్కబెడుతోన్న ప్రభాస్!

Wed 11th Nov 2020 10:32 PM
prabhas,private jet,young rebel star,bollywood,radhe shyam  ప్రైవేట్ ఫ్లైట్‌లో పనులు చక్కబెడుతోన్న ప్రభాస్!
This is the Young Rebel Star Prabhas Private Jet Story ప్రైవేట్ ఫ్లైట్‌లో పనులు చక్కబెడుతోన్న ప్రభాస్!
Advertisement
Ads by CJ

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ స్టార్ హీరోస్‌కి సమానమైన క్రేజ్ ప్రభాస్ సొంతమైంది. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ.. ఇలా ప్రభాస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ కే మొగ్గు చూపుతున్నాడు. అటు సంపాదన పరంగాను, ఇటు రేంజ్ పరంగాను సౌత్ ఇండియా స్టార్ హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ ముగించుకుని ముంబైలో ఆదిపురుష్ చర్చల్లో పాల్గొంటున్నాడట. అయితే కరోనాకి కంగారు పడిన ప్రభాస్ ఓ ప్రైవేట్ జెట్ ని మెయింటింగ్ చేస్తున్నట్టుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినవస్తున్నాయి.

ప్రభాస్ కరోనా కారణంగా ఫ్లైట్స్ లో వెళ్లి రావడం ఎందుకు రిస్క్ అని.. తన ఎన్ఆర్ఐ ఫ్రెండ్ నుండి ఓ ప్రైవేట్ జెట్ తీసుకుని అందులోనే జర్నీ చేస్తున్నాడట. అందరి కన్నా ముందే ప్రభాస్ ధైర్యంగా ఇటలీ వెళ్లి రాధేశ్యామ్ షూటింగ్ చెయ్యడానికి ఆ ప్రైవేట్ జెట్టే కారణమట. ఇక జార్జియాలో రాధేశ్యామ్ షూటింగ్ ముగించుకుని ప్రభాస్ ప్రైవేట్ ఫ్లైట్ లోనే హైదరాబాద్ రావడం, మళ్ళీ ముంబైకి వెళ్లి అక్కడ ఆదిపురుష్ కథా చర్చలో పాల్గొనడం చేస్తున్నాడని టాక్. తన ఫ్రెండ్ ప్రైవేట్ ఫ్లైట్ లోనే ప్రభాస్ ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అంటున్నాడు.

This is the Young Rebel Star Prabhas Private Jet Story:

Prabhas Takes Private Jet from His Friend

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ