వకీల్‌సాబ్‌తో మళ్ళీ సినిమాలు మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా తర్వాత క్రిష్‌తోనూ, హరీష్ శంకర్‌తోనూ సినిమాలను ఓకే చేశాడు. పవన్ కళ్యాణ్ స్పీడు చూసి కరోనాకి కళ్ళు కుట్టింది. ఏడు నెలలు పవన్ టైం వృధా చేసింది కరోనా. అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు పవన్ దూరంగానే ఉన్నాడు. అయితే కరోనాకి ముందు పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. క్రిష్ స్పీడు చూసే పవన్ కళ్యాణ్ ఆ సినిమా చెయ్యబోతున్నాడనుకున్నారు. మరి వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా చేస్తాడనే అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ అయ్యేలోగా క్రిష్, పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో చిన్న సినిమా చక్కెబెట్టేశాడు.
కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత మలయాళ రీమేక్ అయ్యప్పన్ కోషియమ్ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకి ఓ 40 రోజుల డేట్స్ అయితే సరిపోతాయి. ఇంతలో ఆ సినిమా అయ్యిపోతుంది. అదే క్రిష్ సినిమా అయితే చాలా డేట్స్ కావాలి. అందుకే ముందు ఆ రీమేక్‌ను ఫినిష్ చేసే యోచనలో పవన్ ఉండగా.. క్రిష్ మళ్ళీ ఖాళీగా మిగిలిపోయాడు. క్రిష్ ఖాళీగా లేడు.. పవన్ కోసం సినిమా వర్క్ చేసుకుంటున్నాడు అంటున్నారు.
వకీల్ సాబ్ షూటింగ్ అప్పుడు పవన్ సినిమా ఓకే చెయ్యడంతో క్రిష్ పూర్తి స్క్రిప్ట్ అవ్వకుండానే పవన్ తో సినిమా మొదలెట్టేశాడు. కానీ ఇప్పుడు పవన్ మరో సినిమా చేస్తున్నాడు.. ఈలోపు ఆ మిగతా కార్యక్రమాలను క్రిష్ చక్కబెడతాడు .. పవన్ బిజీ క్రిష్ కి అలా కలిసొచ్చింది అంటూ కొన్ని వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. క్రిష్ కరోనా లాక్‌డౌన్‌లో పవన్ సినిమాపై పూర్తి వర్క్ చేసుకుని పవన్ రాక కోసం వెయిట్ చేస్తున్నాడు అని.. ఇప్పుడు పవన్ సినిమా పనులు కొత్తగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు.