ముకుంద, ఒక లైలా కోసం లాంటి ట్రెడిషనల్ మూవీస్ చేసినా రాని క్రేజ్... డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో బికినీ వేసి, నడుము చూపిస్తూ హాట్ హాట్ గా గ్లామర్ షో చెయ్యగానే.. ఒక్కసారిగా టాప్ హీరోలతో ఛాన్సులు పట్టేసింది పూజా హెగ్డే. అప్పటినుండి ఇప్పటివరకు గ్లామర్ పాత్రలను పట్టేసి మరో హీరోయిన్‌కి స్పేస్ ఇవ్వకుండా దూసుకుపోతున్న పూజా హెగ్డే కి ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఛాన్సెస్ కూడా వచ్చేస్తున్నాయ్. మోహింజదారో దెబ్బకి బాలీవుడ్ కి బై బై చెప్పిన పూజా హెగ్డే మళ్ళీ చాలా ఏళ్ళకి హౌస్ ఫుల్ 4 లో నటించి హిట్ కొట్టింది. తర్వాత అక్షయ్ కుమార్ తో ఛాన్స్ తగలడమే కాదు... తాజాగా టాప్ స్టార్ రన్వీర్ సింగ్ తో సర్కార్ సినిమాలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఛాన్స్ పట్టేసింది.
మరి బాలీవుడ్‌లో క్రేజ్ వచ్చేస్తుంది.... మనం సౌత్ విషయంలో ఎలా అంటే ఏమవుతుంది అనుకుందేమో అందుకే సౌత్ సినిమాలో ఎలాంటివి ఉంటే సౌత్ ప్రేక్షకులకు నచ్చుతాయో.. ఓపెన్‌గా చెప్పేస్తుంది. సౌత్ ప్రేక్షకులే తనని టాప్ పొజిషన్ లో నిలబెట్టారనే విషయం మరిచిపోయిందో.. సౌత్‌తో అవసరం తీరిపోయింది అనుకుందో కానీ.. తాజాగా పూజా హెగ్డే సౌత్ మీద చేసిన వ్యాఖ్యలతో సౌత్ అభిమానులు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూ లో సౌత్ సినిమాలను, ప్రేక్షకులను పొగుడుతూనే.. సౌత్ ఇండియన్ సినిమా వాళ్లు, అభిమానులు ఎక్కువగా నడుము మత్తులోనే ఉంటారని... గ్లామర్ డ్రెస్సులలోనే చూడడానికి అంటే హాట్ గా కనిపిస్తేనే ఆదరిస్తారంటూ పూజా చేసిన కామెంట్స్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలకు దారి తీసింది.
మరి తెలుగు సినిమాల్లో గ్లామర్ షో చేస్తేనే క్రేజ్ వచ్చింది అనేది బహిర్గతమే. మరి పూజా గ్లామర్ షో చెయ్యను అంటే దర్శకులు ఆమె వెంట పడేవారు కాదు.. పూజా హెగ్డే ఇలా టాప్ పొజిషన్‌లోనూ ఉండేది కాదు... గ్లామర్‌గా కనిపించింది.. ఆఫర్స్ పట్టేసింది. మరి అంత జరిగాక తన నడుము చూసి ఆఫర్స్ వచ్చాయి.. నడుము మత్తులోనే అభిమానులు ఉంటారంటే.. ప్రేక్షకులకి కోపం రాకుండా ఉంటుందా?. అందుకే ఆమె సౌత్ సినీ ఇండస్ట్రీకి క్షమాపణలు చెప్పాలంటూ.. డిమాండ్స్ పెరుగుతున్నాయి.