బాహుబలితో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రభాస్ చేసే సినిమాలన్నీ బాలీవుడ్ టార్గెట్ తోనే తెరకెక్కుతున్నాయి. అందుకే ప్రభాస్ కోసం ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ దిగుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో బాలీవుడ్ హీరోయిన్స్ తప్ప సౌత్ భామలెవరూ ప్రభాస్ పక్కన కనిపించే ఛాన్స్ కనిపించడం లేదు. నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రభాస్ కోసం దీపికా పదుకొనె ని హీరోయిన్ గా ఎంపిక చేసాడు. దీపికా పదుకొనేని ఒప్పించడానికి నాగ అశ్విన్ చేసిన ప్రయత్నాలు ఫలించి ప్రభాస్ కి దీపికా దొరికింది. అయితే నాగ్ అశ్విన్ దీపికా ని హీరోయిన్ గా ఫైనల్ చెయ్యకపోయినా.. ప్రభాస్ తో మరో సినిమాలో దీపికా పదుకొనెని హీరోయిన్ గా సెట్ అయ్యేదని తెలుస్తుంది. అంటే ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలు చెయ్యడంతో ఓం రనౌత్ తో ఓ పాన్ ఇండియా మూవీని ప్రకటించాడు ప్రభాస్.
బాలీవుడ్ దర్శకుడు ఓం రనౌత్ భారీ బడ్జెట్ తో ప్రభాస్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని తీసుకున్న ఓం రనౌత్ సీత పాత్రకి దీపికా పదుకొనే అయితే ప్రభాస్ క్రేజ్ కి, ఆయన హిట్ కి మ్యాచ్ అవుతుంది అని అనుకునేలోపే నాగ్ అశ్విన్ దీపికా పదుకొనేని ప్రభాస్ కోసం పట్టుకొచ్చెయ్యడంతో ఓం రనౌత్ ఇప్పుడు ప్రభాస్ పక్కన అంత మ్యాచ్ అయ్యే హీరోయిన్ వెతుకులాటలో నానా తంటాలు పడుతున్నాడట. దీపికా అయితే తన ఆదిపురుష్ కి పర్ఫెక్ట్ హీరోయిన్ అని, పద్మవత్ లో దీపికా బాడీ లాంగ్వేజ్, ఆమె స్టైల్ అన్ని సూపర్ గా ఉండడంతో ప్రభాస్ పక్కన ఆదిపురుష్ హీరోయిన్ గా బావుంటుంది అని ఓం రనౌత్ అనుకున్నాడట. కానీ నాగ్ అశ్విన్ దీపికా అనేసరికి ఓం రనౌత్ సైలెంట్ అయ్యాడని తెలుస్తుంది.