మహానటి క్రేజ్ ఉండనే ఉంది.. అందుకే ఆమెని సినిమాలోకి తీసుకుంటే సినిమాకి ఆకర్షణగా మారుతుంది. అందులోనూ మహేష్ బాబు పక్కన కొత్త కాంబో అంటూ కీర్తి సురేష్ ని దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడు. అయితే ఈ మధ్యన కీర్తి సురేష్ లుక్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. చీర కట్టినా, డ్రెస్ వేసినా, టి షార్ట్, ప్యాంట్ వేసినా చిక్కిపోయి.. సన్నగా కాస్త అంద విహీనంగా తయారవడమేకాదు.. కీర్తి ఫేస్‌లో ఉండాల్సిన ఆమెకి ముఖ్యమైన బ్యూటీ స్పాట్ లో గ్లో కనిపించకపోవడంతో మహేష్ పక్కన కీర్తి సురేష్ బావుండదు అని మహేష్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. నానితో కీర్తి సురేష్ సర్కారు వారి పాట నుండి తప్పించబోతున్నారనే టాక్ నడిచింది.
ఆమె పుట్టిన రోజునాడు మహేష్.. కీర్తి మా సినిమాలో నటిస్తుంది అని క్లారిటీ ఇచ్చేశాడు. దానితో మహేష్ ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ లుక్ పక్కనబెడితే ఇప్పుడు ఆమె నటించిన సినిమాలు వరస ప్లాప్స్. అలాగే కీర్తి నటన విషయంలో విమర్శలు వినిపించడంతో మహేష్ ఫ్యాన్స్ లో మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల ఫలితాలు చూశాక మహేష్ ఫ్యాన్స్ వామ్మో కీర్తి సురేష్ అంటూ భయపడుతున్నారు. మరి సర్కారు వారి పాట కోసం కీర్తి సురేష్‌ని తీసుకుని దర్శకుడు, హీరో ఏమన్నా తప్పు చేశారా.. లేదా.. అనేది సినిమా ఫినిష్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకు తెలియదు.