Advertisementt

కంటెస్టెంట్స్ సీక్రెట్స్ ని రివీల్ చేస్తున్న బిగ్‌బాస్

Mon 09th Nov 2020 11:02 AM
bigg boss,sympathy,bigg boss telugu,nagarjuna,secrets,contestants  కంటెస్టెంట్స్ సీక్రెట్స్ ని రివీల్ చేస్తున్న బిగ్‌బాస్
Bigg Boss Reveals Top Secrets of Contestants కంటెస్టెంట్స్ సీక్రెట్స్ ని రివీల్ చేస్తున్న బిగ్‌బాస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 లోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్ బిగ్ బాస్ పై పూర్తి అవగాహనతో.. ఎలా ఆడితే హైలెట్ అవుతారో, ఎలా ఉంటే స్క్రీన్ స్పేస్ లభిస్తుందో అన్న విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారని బుల్లితెర ప్రేక్షకులకు అర్ధమై చాలా కాలం అయ్యింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల కోసం గేమ్ ప్లాన్ చేస్తున్నారు. తాము ఎలా ఉంటామో అలా ఉండకుండా గేమ్ మీదే ఫోకస్ పెడుతున్నారు. నిన్నమొన్నటివరకు ఫెయిర్ గా ఉండే అరియనా కెప్టెన్ అయ్యాక తన విశ్వరూపం చూపిస్తుంది. ఇక అఖిల్- మోనాల్ కావాలనే అలా ప్రేమికుల్లా టైం స్పెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రేక్షకుల సింపతీ కోసం కంటెస్టెంట్స్ నానా విధాలుగా ట్రై చేస్తూ తమ లైఫ్ లోని షాకింగ్ విషయాలను, సీక్రెట్స్ ని చెబుతున్నారు.

గతంలో అరియనా తమ ఫాదర్ నుండి విడిపోయి.. చెల్లి, అమ్మ, నేను అందరం ఆడవాళ్ళం మగవాడి అండ లేదు అంటే.. హారిక కూడా మా పేరెంట్స్ విడిపోయారు.. నేను అమ్మ, అన్నయ్య ఉంటాము అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే యాంకర్ లాస్య తమ పెళ్లి, బిడ్డని పోగొట్టుకోవడం రివీల్ చేసింది. 2010 లోనే మంజునాధ్ ని పెళ్లి చేసుకున్న లాస్య.. పేరెంట్స్ చెప్పారని ఆ విషయం ఎవరికీ చెప్పకుండా.. లైఫ్ లో సెటిల్ అయ్యాకా ఆ విషయం చెప్పాలనుకుంటే 2014 లో లాస్య గర్భవతి అవడంతో షాకయిన ఆ జంట ఆ బిడ్డని అబార్షన్ తో తీయించుకున్నారట. అప్పటినుండి ఇప్పటికి ఆ బిడ్డ కోసం లాస్య  పడే ఆవేదనని బిగ్ బాస్ షోలో రివీల్ చేసింది. ఇప్పటివరకు పేరెంట్స్ కి కూడా చెప్పని ఆ విషయాన్ని కేవలం బిగ్ బాస్ ప్రేక్షకుల సింపతీ కోసమే లాస్య రివీల్ చేసినట్టుగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Bigg Boss Reveals Top Secrets of Contestants :

Sympathy Way Runs in Bigg Boss Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ