Advertisementt

బిగ్ బాస్: కుమార్ సాయికి అంతివ్వలేదా?

Sun 08th Nov 2020 12:04 PM
kumar sai,bigg boss,remunerations,nagarjuna  బిగ్ బాస్: కుమార్ సాయికి అంతివ్వలేదా?
Kumar Sai Sensational Comments on Bigg Boss బిగ్ బాస్: కుమార్ సాయికి అంతివ్వలేదా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి వెళితే అంతొస్తుంది ఇంతొస్తుంది..  భారీగా రెమ్యూనరేషన్ దండుకుంటారు.. అనే విషయం ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతుంది. నిన్నమొన్నటివరకు కంటెస్టెంట్స్ పారితోషకాలు ఆకాశంలో ఎగిరాయి. కానీ ఇప్పుడు బయటికొచ్చిన కంటెస్టెంట్స్ చెప్పిన మాటలు చూస్తే బిగ్ బాస్ పారితోషకాల విషయంలో ఓ పెద్ద కహానీ నడుస్తుంది అనిపిస్తుంది. ఇక బయటికొచ్చిన కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడు కామ్ గా ఉండి.. బయటికొచ్చాక అసలు రంగు బయటపెడుతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న కంటెస్టెంట్స్ బయట బ్లాస్ట్ అవుతున్నారు. ఇంతకు ముందు బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ లో కేవలం దివి మాత్రం తనకి బయట క్రేజ్ పెరిగి ఆఫర్స్ వస్తాయని బిగ్ బాస్ పై పాజిటివ్ గా మాట్లాడింది. మిగిలిన ఎలిమినేటర్స్ బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు.

మొన్నటికి మొన్న నోయెల్ తాను ఇంట్లో చాలా యాక్టీవ్ గా ఉండేవాడిని కానీ నన్ను బిగ్ బాస్ బయటికి చూపించలేదు. నేనేమన్నా హౌస్ లోని బాత్ రూమ్ లో దాక్కున్నానా.. కేవలం బిగ్ బాస్ కొందరిని ఫోకస్ చేస్తూ ఫుటేజ్ ఇస్తుంది అంటూ మండి పడ్డాడు. ఇక నేడు కుమార్ సాయి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ భాగోతాన్ని బట్టబయలు చేశాడు. హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి కాస్త కుదురుకుంటున్న సమయంలో కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. ఇక బయటికి వచ్చాక కాస్త పాజిటివ్ గానే ఉన్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ గురించి ఓపెన్ అవుతున్నాడు. తనకి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారనేది గాసిప్ అని.. తాను సినిమాలకు రోజుకి ఎంత తీసుకుంటానో అంతే బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చారని చెప్పడంతో.. బిగ్ బాస్ కి వెళ్లిన వారికి లక్షలు, కోట్లు పారితోషకాలు అనే విషయం కేవలం రూమర్ అని బహిర్గతమైంది. కుమార్ సాయి సినిమాల్లో రోజుకి 10 వేలు లోపే అందుకుంటాడని.. దీన్ని బట్టి బిగ్ బాస్ లో భారీ రెమ్యూనరేషన్ అనేది కహాని అని అర్ధమవుతుంది.

Kumar Sai Sensational Comments on Bigg Boss:

Kumar Sai Talks About Bigg Boss Remunerations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ