మహానటి క్రేజ్ ని కీర్తి వినియోగించుకోలేకపోయింది అనేది.. మహానటి తర్వాత కీర్తి సురేష్ చేసిన సినిమాలు చూస్తే క్లియర్ గా అర్ధమవుతుంది. పందెం కోడి 2, సర్కార్ ఈ సినిమాలు మహానటి ముందే ఓకే చెప్పింది కాబట్టి.. ఈ లిస్ట్ లో ఆ సినిమాలు తీసేసినా.. హీరోయిన్ ఓరియెంటెడ్ అంటూ పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఒప్పుకున్న కీర్తి సురేష్ కి ఆ సినిమాలు ఎంత నిరాశని మిగిల్చాయో చూశాం. కరోనా లాక్ డౌన్ కారణంగా కీర్తి సురేష్ నిర్మాతలు కీర్తి సినిమాలైన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలను ఓటిటికి అమ్మేశారు కానీ.. అవే సినిమాలు థియేటర్స్ లో విడుదలై ఉంటే నిర్మాతలు నిండా మునిగేవారు.
కాకపోతే ఇప్పుడు ఓటిటి వాళ్ళు ఏడుస్తున్నారు అది వేరే విషయం. లాక్ డౌన్ కారణంగా కీర్తి సురేష్ క్రేజ్ చూసి పెంగ్విన్ సినిమాని అమెజాన్ ప్రైమ్ కొనుక్కుంటే.. అక్కడ ఆ సినిమా ప్లాప్. ఇక మిస్ ఇండియాని నెట్ ఫ్లిక్స్ వాళ్ళు కొంటే రీసెంట్ గా అది ప్లాప్. మరి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు కీర్తి సురేష్ సినిమాలు కొన్ని ఇప్పుడు ఘొల్లుమంటున్నారు. మహానటి క్రేజ్ ఉంది, ఫేమ్ ఉన్న హీరోయిన్ అని సినిమాలు కొంటే.. ఇప్పుడవి ప్లాప్ టాక్ తో ఓటిటీలకు పెద్ద పరీక్షగా మారాయి. మరి ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే.. నెక్స్ట్ గుడ్ లక్ సఖి ఎలా ఉండబోతుందో చూడాలి.