Advertisementt

దీపావళికైనా ఈ క్రేజీ ఫిల్మ్ అప్డేట్ ఉంటుందా?

Fri 06th Nov 2020 01:21 AM
yash,kgf 2,no updates,deepavali,dasara,kgf fans,crazy film  దీపావళికైనా ఈ క్రేజీ ఫిల్మ్ అప్డేట్ ఉంటుందా?
Audience Waiting for KGF 2 Update దీపావళికైనా ఈ క్రేజీ ఫిల్మ్ అప్డేట్ ఉంటుందా?
Advertisement
Ads by CJ

కరోనాతో పోస్ట్ పోన్ అయిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి సెట్స్ మీదకెళ్ళిపోతున్నాయి. అందరి కన్నా ముందు కన్నడలో భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్న కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెట్స్ మీదకెళ్లింది. మొదట్లో ఆ సినిమాలో కీలక పాత్ర అధీరా పాత్ర చేస్తున్న సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడడంతో.. కెజిఎఫ్ 2 సినిమా షూటింగ్ ఏమన్నా ఆలస్యం అవుతుందేమో అనుకుంటే.. సంజయ్ దత్ క్యాన్సర్ ని జయించి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. అయితే కెజిఎఫ్ 2 సంక్రాంతికి విడుదలవుతుంది అంటున్నారు కానీ.. దాని హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. దసరాకి కెజిఎఫ్ 2 పోస్టర్ కానీ, అప్ డేట్ కానీ వస్తుంది అనుకుంటే కెజిఎఫ్ టీం ఎక్కడా కనిపించలేదు.

సోషల్ మీడియాలోని కెజిఎఫ్ 2 అప్ డేట్ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కెజిఎఫ్ హిట్ కావడంతో యావత్ ఇండియాలోని ప్రేక్షకుల్లో కెజిఎఫ్ 2 సినిమా కోసం ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందుకే కెజిఎఫ్ సినిమా డేట్ ఎప్పుడు ఇస్తారా.. సినిమాలోని యశ్ లుక్స్ ఎప్పుడు వదులుతారా? కెజిఎఫ్ 2 టీజర్ దివాళి కైనా ఉంటుందా? అని యశ్ అభిమానులే కాదు... అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ కెజిఎఫ్ 2 నుండి దీపావళి కానుకగా ఏమన్నా అప్ డేట్ లాంటిది ఇస్తారో.. లేదంటే ముందు షూటింగ్ కానివ్వండి.. తర్వాత అప్ డేట్ గురించి ఆలోచిద్దాం అంటారో చూడాలి.

Audience Waiting for KGF 2 Update:

No Updates From Yash KGF 2 Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ