Advertisementt

కాజల్ ప్రేమ - పెళ్లి ముచ్చట్లు!!

Tue 03rd Nov 2020 06:41 PM
kajal aggarwal,gautam kitchlu,love story,wedding  కాజల్ ప్రేమ - పెళ్లి ముచ్చట్లు!!
Kajal Aggarwal and Gautam Kitchlu: 7 Years Friend ship - 3 years love కాజల్ ప్రేమ - పెళ్లి ముచ్చట్లు!!
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ తాజాగా గౌతమ్ కిచ్లు ని ముంబై లోని తాజ్ హోటల్ లో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్యన పెళ్లి చేసుకుంది. కరోనా కారణముగా పెళ్ళికి ఎవరిని పిలవలేకపోయిన కాజల్ అగర్వాల్ ఆఖరుకి రిసెప్షన్ కి కూడా ఎవరిని పిలవలేదు. ఎమన్నా అంటే కరోనా పోవాలి.. అప్పుడే రిసెప్షన్ అంటుంది. అయితే కాజల్ ఉన్నట్టుండి లాక్ డౌన్ లో పెళ్లి చేసుకోవడంతో.. అసలు గౌతమ్ కిచ్లు తో కాజల్ కి ఎలా పరిచయం... కాజల్ పెళ్లి ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అంటూ చాలామందిలో అనుమానులున్నాయి.

అయితే తాజాగా కాజల్ అగర్వాల్ తన పెళ్లి ముచ్చట్లను బయట పెట్టింది. గౌతమ్ కిచ్లు తో తనకి ఏడేళ్ల గా పరిచయం అంటే స్నేహం ఉందని.. గత మూడేళ్ళుగా లవ్ లోను డేటింగ్ లో ఉన్నామని చెప్పిన కాజల్ లాక్ డౌన్ మా పెళ్లికి బాగా కలిసొచ్చింది అని చెబుతుంది. రోజు రోజుకి మా బంధం పెరుగుతూ వచ్చింది అని.. అది కరోనా లాక్ డౌన్ టైం లో మరింత బలపడింది అని.. కరోనా లాక్ డౌన్ తో కొన్ని రోజులు ఇంటికే పరిమితమై గౌతమ్ ని చూడకుండా ఉండాల్సి వచ్చింది అని.. మాస్క్ లతో కొన్ని రోజుల తర్వాత సరుకుల కోసం బయటికి వెళ్ళినప్పుడు కలుసుకున్నామని, ఇక విడి విడిగా ఉండలేమని అర్ధమయ్యాకే పెళ్లి పీటలెక్కామని తమ ప్రేమ, పెళ్లి గురించి కాజల్ ఇలా ముచ్చట్లు బయటపెట్టింది.

Kajal Aggarwal and Gautam Kitchlu: 7 Years Friend ship - 3 years love:

Kajal Aggarwal and Gautam Kitchlu Love Story Revealed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ