Advertisementt

పవన్.. ‘వకీల్‌సాబ్’పై అసలు క్రేజ్ ఉందా?

Tue 03rd Nov 2020 01:30 PM
pawan kalyan,vakeel saab,sankranti release  పవన్.. ‘వకీల్‌సాబ్’పై అసలు క్రేజ్ ఉందా?
Craze downed on Pawan Kalyan Vakeel Saab Movie పవన్.. ‘వకీల్‌సాబ్’పై అసలు క్రేజ్ ఉందా?
Advertisement
Ads by CJ

ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ వరస సినిమాలకి కమిట్ అవడమే కాదు.. తాను ఒప్పుకున్న వకీల్ సాబ్ షూటింగ్ కి లేటెస్ట్ గా జాయిన్ అయ్యాడు. సినిమాలను పరుగు పెట్టిస్తాడో.. మెల్లగా చేస్తాడో తెలియదు కానీ.. పవన్ కమిట్ అయిన సినిమాల లిస్ట్ మాములుగా లేదు. ఇక పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా తో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. పింక్ రీమేక్ కాబట్టి ఈ సినిమాపై మొదట్లో దిల్ రాజు హడావిడి తప్పితే.. సినిమాపై అంతగా క్రేజ్ లేకపోయినా.. పవన్ వకీల్ సాబ్ లుక్ తో పాటుగా మోషన్ పోస్టర్ వచ్చాక సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. హిందీ,. తమిళ్ లో వచ్చేసిన పింక్ రీమేక్ తెలుగులో ఆడుతుందా అంటే పవన్ క్రేజ్ తో వకీల్ సాబ్ హిట్ పక్కా అని దిల్ రాజు నమ్మాడు కాబట్టి బాగా ఖర్చు పెట్టి సినిమా తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ తప్ప వకీల్ సాబ్ పై మరే ప్రేక్షకుడు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనిపిస్తుంది. పింక్ సినిమాని పవన్ రీమేక్ చేస్తున్నాడు అనగానే ఆ సినిమాని చాలామంది చూసేసారు. అంతేకాదు. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అయినా సినిమా థియేటర్స్ లో విడుదలైన ప్రేక్షకులు కరోనా కి కంగారు పడుతున్నారు. ఇక వకీల్ సాబ్ సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు కానీ.. క్లారిటీ ఇవ్వడం లేదు. పవన్ కూడా సైలెంట్ గా షూటింగ్ కి వెళుతున్నాడు. మరి మెల్లి మెల్లిగా సినిమాపై క్రేజ్ తగ్గుతుంది అనిపిస్తుంది. అందుకే అందరూ పవన్ వరస సినిమాలు ఒప్పుకోవడమే కాదు... కాస్త క్రేజ్ సంగతి చూసుకో అంటూ సలహాలిస్తున్నారు.

Craze downed on Pawan Kalyan Vakeel Saab Movie:

Pawan Kalyan joined Vakeel Saab Movie Shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ