ఆచార్య షూటింగ్ యమా స్పీడుగా జరుగుతున్న టైమ్‌లో కరోనా రావడం.. అందరికన్నా ముందే చిరు ఆచార్య షూటింగ్ కి బ్రేకిచ్చేసి ఇంటికెళ్లిపోవడం వంటివి తెలిసిన విషయాలే. అదిగో అప్పటినుండి మళ్ళీ షూటింగ్స్ మొదలైనా ఆచార్య మాత్రం ఇంకా సెట్స్ మీదకెళ్ళడం లేదు. చిరు ఓకే అంటే కొరటాల ఆచార్యని మొదలు పెట్టేందుకు పిచ్చ క్లారిటీతో ఉన్నాడనే ప్రచారం జరుగుతుంటే.. అబ్బే అలాంటిదేం లేదు.. కొరటాల ఇంకా ఆచార్య స్క్రిప్ట్ లోనే ఉన్నాడు. ఆ ఆచార్య స్క్రిప్ట్ లో కొరటాల తలమునకలై ఉన్నాడట. కారణం ఏమిటయ్యా అంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ 30 నిమిషాల రోల్ ప్లే చేస్తున్నాడు. RRRతో ఓ రేంజ్‌లో కనబడుతున్న రామ్ చరణ్‌ని ఆచార్య లోను అంత కన్నా పవర్ ఫుల్‌గా చూపించాలి అని కొరటాల డిసైడ్ అయ్యాడట.
మరి స్క్రిప్ట్‌లో ఎలాంటి లోటు ఉండకుండా చూసుకోవడం కొరటాల స్టయిల్. అందుకే రామ్ చరణ్‌కి సంబంధించిన సన్నివేశాల విషయంలో కొరటాల అస్సలు కాంప్రమైజ్ అవడం లేదట. రామ్ చరణ్ కనిపించబోయే ఆచార్య ఫ్లాష్ బ్యాగ్ సినిమాకి చాలా కీలకం కాబట్టే.. రామ్ చరణ్ ఎపిసోడ్ విషయంలో కొరటాల అంత గట్టిగా ఉన్నాడట. గతంలోనే చరణ్ పాత్రకి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయినా.. కొరటాల దానికి మరింత మెరుగు దిద్దే పనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నాడట. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మరో రచయిత సాయంతో కొరటాల మళ్లీ మళ్లీ రాసుకుంటున్నాడని టాక్. అందుకే చిరు పిలిచే వరకు కొరటాల ఆచార్య స్క్రిప్ట్‌లోనే ఉంటాడని అంటున్నారు.