రాజమౌళి చరిత్రలో దేశం కోసం పోరాడిన రెండు పాత్రలతో RRR ఓ పెద్ద మహా యజ్ఞాన్ని తలపెట్టాడు. దేశం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు.. కొమరం భీం ల పాత్రలతో రాజమౌళి RRR రౌద్రం - రణం - రుధిరం అంటూ తెరకెక్కించే సినిమాలో అటు కొమరం భీం కానీ ఇటు అల్లూరి పాత్రలను పూర్తి దేశభక్తి కే అంకితం చెయ్యకుండా.. సినిమాటిక్ స్టయిల్ అంటే.. వాళ్ళ దేశభక్తి , దేశం కోసం పోరాడే దృశ్యాలను కాస్త స్టయిలిన్గ్ గా పరిచయం చెయ్యబోతున్నాడు. లేదంటే RRR పూర్తి దేశభక్తి చిత్రం జోనర్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే కొమరం భీం ముస్లిం పాత్ర, ఆయన టోపీ పై రాజమౌళి బిజెపి నేతల నుండి బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు. అయినా రాజమౌళి తనేం చెయ్యబోతున్నాడో.. చెయ్యాలనుకుంటున్నాడో బిజెపి నేతలకు క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళ సహనానికి పరీక్షా పెడుతున్నాడు.
అయితే ఇపుడు RRR లో అటు సినిమా స్టయిల్ తో పాటుగా ఇటు దేశభక్తి కి సంబందించిన అంటే భారతదేశంలో జరిగిన ఓ బాధాకర సంఘటనని ఈ సినిమాలో రాజమౌళి చూపించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అది ఏంటో మంది దేశభక్తులను పొట్టనబెట్టుకున్న.. బ్రిటిష్ వారి తుపాకీ గుళ్ళకి బలినపోయి మరణించిన ఘటన.. జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని రాజమౌళి RRR లో ప్లాన్ చేసినట్టుగా టాక్. జలియన్ వాలాబాగ్ ఘటనతో భారతీయుల్లో బ్రిటిష్ వారి పట్ల మరింత ఏహ్య భావం, వారిని ఇండియా నుండి తరిమికొట్టాలంటూ పలు ఉద్యమాలకు కారణమైన ఆ ఘటనని RRR లో చూపించబోతున్నారని.. ఆ ఎపిసోడ్ సినిమా కె హైలెట్ అనే రేంజ్ లో రాజమౌళి డిజైన్ చేసుకున్నాడని ఫిలింనగర్ టాక్.