స్టార్ హీరో అల్లు అర్జున్ పక్కన అవకాశం అంటే.. హీరోయిన్స్‌కి పండగే. అల్లు అర్జున్‌తో సమానమైన డాన్స్ స్టెప్స్ వెయ్యాలి.. అల్లు అర్జున్ పక్కన స్లిమ్‌గా నాజూగ్గా కనిపించాలి. ఇలా ఆలోచిస్తారు హీరోయిన్స్. అలానే ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఛాన్స్ మాత్రమే కాదు.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన రష్మిక కూడా ఆలోచిస్తుంది. అందుకే జిమ్‌లో తెగ బరువులు ఎత్తేస్తుంది. చూడటానికి పిచ్చుకలా కనబడే రష్మిక ఇప్పుడు తెగ బరువులు ఎత్తుతోంది అంటే.. వర్కౌట్స్ మీద ఎంత ఇంట్రెస్టో అనిపిస్తుంది కదా..!
కాదు కాదు.... బాడీ ఫిట్‌గా ఉండాలి.. నాజూగ్గా ఉండాలి, అల్లు అర్జున్‌తో అదిరిపోయే స్టెప్స్ వెయ్యాలి. అసలే అల్లు అర్జున్ పక్కన అవకాశం ఇది రష్మిక ఎగ్జైట్మెంట్. అందుకే పాప జిమ్‌లో బాగా కష్టపడుతుంది. మొన్నామధ్యన బీచ్‌లో ఎక్సర్‌సైజులు చేసిన రష్మిక ఇప్పుడు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ చమట్లు చిందిస్తుంది. తన ట్రైనర్ ఆధ్వర్యంలో రష్మిక జిమ్‌లో ఫిగర్‌ని పర్ఫెక్ట్‌గా ఉండేలా కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి అల్లు అర్జున్‌తో పాటుగా రష్మిక ఈ నెల ఫస్ట్ వీక్‌లోనే పుష్ప షూటింగ్ సెట్స్‌లోకి వెళ్లబోతుంది. ఇక శర్వానంద్ తోనూ రష్మిక ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా చేస్తుంది.