గత వారం సమంత రాకతో బిగ్ బాస్ ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ స్టార్ మా కి సమంత ఎపిసోడ్ టీఆర్పీ పరంగా షాకివ్వడంతో కులుమనాలిలో వైల్డ్ డాగ్ షూటింగ్ లో ఉన్న నాగ్ ఆఘమేఘాల మీద ఫ్లైట్ ఎక్కి మరీ బిగ్ బాస్ కోసం వాలిపోయాడు. శనివారం నాగార్జునాన్ బిగ్ బాస్ స్టేజ్ మీద హౌస్ మేట్స్ కి బుల్లితెర ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. నిన్న హౌస్ లో నామినేషన్స్ నుండి ఫస్ట్ అఖిల్ సేవ్ అవ్వగా... తర్వాత లాస్య సేవ్ అయ్యింది. ఇక మోనాల్, అరియనా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్స్ లో ఉన్నారు. అయితే నిన్న హెల్త్ ఇష్యుస్ తో హౌస్ నుండి బయటికొచ్చిన నోయెల్ హౌస్ లో కామ్ గా సైలెంట్ గా ఉండి స్టేజ్ మీద రెచ్చ్చిపోయి అమ్మ రాజశేఖర్, అవినాష్ ల మీద బాగా ఫైరవడంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది.
శనివారం ఎపిసోడ్ అయ్యాక అమ్మ రాజశేఖర్, అవినాష్ లు నోయెల్ ఎందుకిలా అన్నాడు.. హౌస్ నుండి వెళ్ళిపోయాడు కాబట్టే అలా అనేశాడు.. వాడు నమ్మదగిన వ్యక్తి కాదని రాజశేఖర్ అంటే.... అవినాష్ కాస్త కోపంగా నేను టెంపరర్లి ఫ్రెండ్ అన్నందుకు నోయెల్ నన్ను బ్యాడ్ చేసాడు అని చర్చ జరుగుతన్న టైం లో నాగార్జున సన్ డే ఎపిసోడ్ కి వచ్చేసాడు. మరి హౌస్ అంతా కాక మీదుంది కూల్ చేద్దామంటూ.. హౌస్ మేట్స్ తో ఫన్నీగా స్కిట్స్ చేయించడం, కూల్ గా డాన్స్ లు చేపిస్తూ అందరిని నవ్వించి కూల్ చేసాడు. ఈ వారం ఎలిమినేషన్స్ లో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడని అందరూ ఫిక్స్ అయ్యారు. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేవారెవరో బిగ్ బాస్ లీకులు ద్వారా మరికాసేపట్లో తేలిపోతుంది.