గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ కొట్టలేకపోయిన హరీష్ శంకర్ కి మళ్ళీ పవన్ కళ్యాణ్ మరోసారి అవకాశం ఇచ్చాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తీసిన సినిమాలు సూపర్ హిట్స్ కాలేకపోయాయి. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కూడా హరీష్ కి హిట్ ఇవ్వలేకపోయారు. అందుకే ఈసారి కొడితే ఇండస్ట్రీ హిట్ అని ఫిక్స్ అయ్యాడట. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో అస్సలు తొందర పడడం లేదట. వకీల్ సాబ్ షూటింగ్ అవ్వాలి.. క్రిష్ తో పిరియాడికల్ మూవీ ఫినిష్ అవ్వాలి.. అప్పుడే పవన్ తన సినిమా సెట్స్ మీదకొస్తాడు. ఈలోపు పక్కా స్క్రిప్ట్ తో హరీష్, పవన్ సినిమా మొదలు పెడతాడట.
మరి వకీల్ సాబ్ కి పవన్ రేపు అంటే నవంబర్ 1 నుండి షూటింగ్ కి వెళ్తున్నాడు. అంటే మరో 20 రోజుల్లో పవన్ వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ అయితే.. క్రిష్ కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి పవన్ కళ్యాణ్ ని సెట్స్ మీదకి తీసుకెళ్ళిపోతాడు. మరి క్రిష్ సినిమా మేకింగ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో తాజాగా వైష్ణవ్ తేజ్ తో తీసిన చిన్న సినిమానే ఉదాహరణ. మరి క్రిష్ తో పవన్ సినిమా కూడా వచ్చే ఎడాది మిడిల్ కి పూర్తి అయ్యేలోపు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కోసం ఇండస్ట్రీ హిట్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడట. అందుకే పవన్ పూర్తి కథ అడిగినా.. మన సినిమా గబ్బర్ సింగ్ మించి హిట్ కావాలి.. అందుకే తొందర పడడం లేదని చెప్పినట్టుగా టాక్.
మరి పవన్ కళ్యాణ్ తో తొందరపడి సినిమా చేసి.. జస్ట్ హిట్ అనిపించుకోవడం హరీష్ శంకర్ కి ఇష్టం లేదట. మరి పవన్ కళ్యాణ్ తో ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా అని హరీష్ శంకర్ ఫిక్స్ అయ్యాడంటే పవన్ ఫ్యాన్స్ కి పండగే. పవన్ పుట్టిన రోజునాడే కాన్సెప్ట్ పోస్టర్ తో పవన్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్తేజాన్ని నింపిన హరీష్ ఇప్పుడు పవన్ సినిమాని బ్లాక్ బస్టర్ చెయ్యడానికి పడే తపనతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.