Advertisementt

నాగ్‌ చెంతనే.. హౌస్‌లోని ఆ ఇద్దరిపై నోయెల్‌ ఫైర్‌!

Sat 31st Oct 2020 07:12 PM
noel sean,fire,bigg boss,avinash,amma rajasekhar  నాగ్‌ చెంతనే.. హౌస్‌లోని ఆ ఇద్దరిపై నోయెల్‌ ఫైర్‌!
Noel Sean Fire on these two Bigg Boss contestants నాగ్‌ చెంతనే.. హౌస్‌లోని ఆ ఇద్దరిపై నోయెల్‌ ఫైర్‌!
Advertisement
Ads by CJ

ఈ వారం బిగ్ బాస్ నుండి అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన నోయెల్.. ట్రీట్మెంట్ తీసుకోవడమే కాదు... ఈ శనివారం నాగార్జున ఎపిసోడ్ లో నాగ్ పక్కన బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నోయెల్ ని బిగ్ బాస్ డాక్టర్ పరీక్ష చేసి. బెటర్ ట్రీట్మెంట్ కోసం బయటికి తీసుకురావడమే కాదు.... మళ్ళీ త్వరలోనే నోయెల్ హౌస్ లోకి రావాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక నోయెల్ కి కరోనా అని.. కాదు వేరే ఏదో ఒక రకమైన అనారోగ్యం అని, అసలు బిగ్ బాస్ నోయెల్ ఆరోగ్య సమస్యని ఎందుకు దాచి పెడుతుంది అంటూ ప్రచారం జరుగుతున్న వేళ..

నోయెల్ తాజాగా బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించడమే కాదు... బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేసే అవినాష్ ని అమ్మ రాజశేఖర్ ని దులిపేసాడు. తన అనారోగ్యం మీద వాళ్ళు కామెడీ చేసారని.. అవినాష్ ని, అమ్మ రాజశేఖర్ ని ఒంటి కాలి మీద నించోబెట్టి తాను అనుభవించిన పెయిన్ ఎలా ఉంటుందో వాళ్లకి చూపించాడు. కొద్దిసేపు నిలబడితేనే మీరు పెయిన్ భరించలేకపోయారు. కానీ నాకు నా కాళ్ళ నొప్పులు దానికి వెయ్యి రేట్లు ఉంది. దానిమీద అవినాష్ -అమ్మ రాజశేఖర్ కామెడీ చేసారు. 

అది చిన్నా, పెద్దా కోట్లమంది ప్రేక్షకులు చూస్తున్నారు. మీరు చేసే కామెడీ చిల్లర కామెడీ అంటూ అవినాష్ - అమ్మ రాజశేఖర్ మీద ఫైర్ అవడంతో.. అవినాష్ కూడా రెచ్చిపోయి.. నువ్వు మమ్మల్ని బయటికి వెళుతూ అందరి ముందు బ్యాడ్ చెయ్యాలని డిసైడ్ అయ్యావు.. అనగానే నోయెల్ కూడా ఎక్కడా తగ్గకుండా పిచ్చ ఇట్ అసలు అనడంతో అమ్మ రాజశేఖర్ కూడా నోయెల్ నీ మాటలతో మేము అగ్రీ అవ్వం అని అన్నాడు. ఇక అవినాష్ మాత్రం నోయెల్ పై రెచ్చిపోయి ఆగ్రహం ప్రదర్శించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నాగార్జున పక్కన ఉండగానే నోయెల్ స్టేజ్ మీద అవినాష్ హౌస్ లో ఈ రకమైన కోపంతో రెచ్చిపోయి మాట్లాడడమే.

Noel Sean Fire on these two Bigg Boss contestants:

Bigg Boss telugu latest Promo goes viral