కరోనా వలన ఒక్క స్కూల్స్ అనే కాదు... రెస్టారెంట్స్, థియేటర్స్, మల్టీనేషనల్ దగ్గరనుండి చిన్న కంపెనీల వరకు లాక్ డౌన్ తో మూత బడ్డాయి. కరోనా వ్యాక్సిన్ ఇంకా రాలేదు.. కరోనా ఉదృతి ఇంకా తగ్గలేదు. కానీ కేంద్ర అన్ లాక్ 5.ఓ తో స్కూల్స్ రీ ఓపెన్ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలెయ్యడంతో... ఏపీ సర్కార్ జగన్ ప్రభుత్వం అందరికన్నా ముందుగా.. నవంబర్ 2 నుండి స్కూల్స్ తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్కూల్స్ రీ ఓపెన్ కి జగన్ సర్కార్ తహతహలాడుతోంది. నవంబర్ 2 నుండి 9, 10, ఇంటర్ కాలేజెస్ తెరవనున్నట్టుగా ఏపీ సర్కార్ చెబుతుంది. నవంబర్ 23 నుండి 6,7,8 తరగతులకు స్కూల్స్ ఓపెన్ చేస్తామని.. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి మిగతా తరగతులకు స్కూల్స్ రీ ఓపెన్ ఉంటుంది అని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అందుకు తగ్గట్టుగా జగన్ ప్రభుత్వం మధ్యాహన్నం భోజన పథకాన్ని కంటిన్యూ చెయ్యడం.. నవంబర్ అంతా ఒంటి పూటబడులు పెట్టడం... రోజు విడిచి రోజు స్కూల్స్ ఓపెన్ చెయ్యడం.. అలాగే తాజాగా 30 శాతం ట్యూషన్ ఫీజు తగ్గించేలా చర్యలు తీసుకుంటుంది. మరి కరోనా ఉదృతంగా ఉన్న టైం లో స్కూల్స్ రీ ఓపెన్ చెయ్యడమే అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో పలు ఛానల్స్ పేరెంట్స్ అభిప్రాయాలను సేకరించింది. అందులో భాగంగా చాలామంది పేరెంట్స్ మా పిలల్ల విద్య సంవత్సరం పోయినా పర్లేదు.. కరోనా కి వ్యాక్సిన్ వచ్చేవరకు మేము మా పిల్లల్ని స్కూల్స్ కి పంపమని తెగేసి చెబుతున్నారు. మరి ఈ విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుంద కదా అని అడిగితె... పోయినా పర్లేదు.. వ్యాక్సిన్ రావాలి.. పిలల్లు బడులకు వెళ్ళాలి అంటున్నారు పేరెంట్స్. ఆన్ లైన్ క్లాస్సేస్ జరుగుతున్నాయి కదా అవి చాలు అంటున్నారు వాళ్ళు. మరి పేరెంట్స్ పిల్లల్ని పంపకుండా స్కూల్స్ ఓపెన్ చెయ్యడం అనేది జగన్ సర్కారుకే తెలియాలి.