టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నేడు పెళ్లి పీటలెక్కబోతుంది. గుట్టు చప్పుడు కాకుండా నిశ్చితార్ధం చేసుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి విషయం చాలా సైలెంట్ గా బయట పెట్టింది. నేడు పెళ్లి పీటలెక్కబోతున్న కాజల్ పెళ్లి వేడుకలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాజల్ మెహిందీ ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్, పసుపు ఫంక్షన్, కాజల్ డాన్స్ వీడియోస్ ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి కూతురిగా పెళ్లి పీటలెక్కుతున్న కాజల్ అగర్వాల్ రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేసుకోలేకపోతుంది. కారణం కరోనా కరోనా కరోనా..
మరి పెళ్ళైన పది రోజుల లోపు తనకు బాగా కలిసొచ్చిన చెన్నై, హైదరాబాద్ లో విడి విడిగా ముఖ్యమైన గెస్ట్ లకు పార్టీ అంటే రిసెప్షన్ ఉండబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. ఈ రిసెప్షన్ కి తాను నటించిన హీరోలతో పాటుగా చాలా కొద్దిమంది ఫ్రెండ్స్, అలాగే ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన కొద్దిమందికి పిలుపులు ఉంటాయని అంటున్నారు.
ఇక చెన్నైలోను ఓ హోటల్ లో కాజల్ రిసెప్షన్ ఉండబోతున్నట్టుగా సమాచారం. సౌత్ లో తనని టాప్ హీరోయిన్ ని చేసిన అభిమానులకు కాజల్ ట్రీట్ ఇవ్వలేకపోతుందని.. కరోనా కారణముగా అన్ని చాలా సింపుల్ గా చేస్తున్నట్టుగా ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న మాట.