Advertisementt

దసరా డల్.. దీవాళికి గట్టిగానే ప్లాన్ చేశారు

Fri 30th Oct 2020 09:10 PM
deepavali treat,audience,long gap,dasara,movie released,aakasam nee hadduraa,miss india  దసరా డల్.. దీవాళికి గట్టిగానే ప్లాన్ చేశారు
Star Heroes targets this Deepavali with their movies దసరా డల్.. దీవాళికి గట్టిగానే ప్లాన్ చేశారు
Advertisement
Ads by CJ

దసరా సెలవలన్నీ సినిమా వాళ్ళకి బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉండడంతో థియేటర్స్ తెరిచినా హీరోలు సాహసం చేయలేక సినిమాలు విడుదల చెయ్యలేదు. దానితో దసరా ఉసూరుమంటూ వెళ్ళింది. థియేటర్స్ లేకపోయినా కనీసం ఓటీటీలో అయినా మంచి సినిమాలు విడుదలవుతాయి అనుకుంటే.. అదీ లేదు. ఈ దసరాకు జస్ట్ చిన్న సినిమా కలర్ ఫోటోతో సరిపెట్టేశారు. పండగ సందడి ఎక్కడా కనబడలేదు. దసరా పొతే పోయింది.. అన్ని భాషల్లోనూ దివాళీకి దుమ్మురేపడం ఖాయం అంటున్నారు.

అంటే థియేటర్స్ దగ్గర బాక్సాఫీసు కళకళలాడుతుందో లేదో క్లారిటీలేదు కానీ.. ఓటీటీలలో మాత్రం చిన్న పెద్ద సినిమాల క్యూ మాములుగా లేదు. తమిళంలో దివాళీకి చాలా సినిమాలు విడుదలవుతాయి. కానీ ఇప్పుడు అన్ని భాషల సినిమాలు ఓటీటీలో తడాఖా చూపించడానికి రెడీ అవుతున్నాయి. అందులో ముందుగా నవంబర్ 4న కీర్తి సురేష్ మిస్ ఇండియా నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతుంటే.. సోలో బ్రతుకే సో బెటరు కూడా దివాళీ రోజున జీ 5లో విడుదల అంటున్నారు. ఇక నవంబర్ 9న బాలీవుడ్ లక్ష్మి బాంబ్ హాట్ స్టార్ లో పేలబోతోంది. కృష్ణ హిస్ లీల ఫేమ్ సిద్దు జొన్నలగట్ట మా వింత గాథ వినుమా కూడా ఆహాలో విడుదలకాబోతుంది.

ఇక తెలుగు తమిళ ప్రేక్షకులకు హీరో సూర్య ఆకాశమే నీ హద్దురా అంటూ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 12 న రాబోతున్నాడు. మరి విశాల్ చక్ర కూడా దివాళీ అంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ చెయ్యాల్సి ఉంది. మరి దివాళికి పటాసులు మాత్రమే పేలవు.. ఈసారి సినిమాల పేలుడు భారీగానే ఉండబోతుంది. ఇక దివాళీ టైం కి థియేటర్స్ గనక 100 శాతం ఆక్యుపెన్సీ అంటే.. థియేటర్స్ దగ్గర కళకళలు తప్పవు.

Star Heroes targets this Deepavali with their movies:

Deepavali Treat to Audience after long gap

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ