Advertisementt

ప్రభాస్ రేంజ్.. రూ. 500 కోట్ల పైనే..!!

Fri 30th Oct 2020 09:01 PM
prabhas,indian cinema,record,prabhas craze,budget,aadipurish,nag ashwin film,young rebel star  ప్రభాస్ రేంజ్.. రూ. 500 కోట్ల పైనే..!!
This is Prabhas Craze at Box Office ప్రభాస్ రేంజ్.. రూ. 500 కోట్ల పైనే..!!
Advertisement
Ads by CJ

ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అవడమే కాదు.. భారీ బడ్జెట్ హీరోగా మారిపోయాడు. బాహుబలి రెండు పార్ట్ లకు కలిసి రాజమౌళి భారీగానే ఖర్చు పెట్టించాడు. ఆ తర్వాత అంటే బాహుబలికి ముందే ప్రభాస్ సాహో సినిమా చేద్దామనుకుని.. బాహుబలి తర్వాత సాహో సినిమా చేసాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో 100 కోట్ల సాహో బడ్జెట్ 300 కోట్లకి పెరిగిపోయింది. సాహో కి కలెక్షన్స్ రాకపోగా.. ప్రభాస్ క్రేజ్ కి డ్యామేజ్ అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ విషయంలో బడ్జెట్ కంట్రోల్ పాటిస్తున్నాడు. ఎంతగా విదేశాల్లో షూటింగ్ అలాగే పాన్ ఇండియా లెవల్ అయినా రాధేశ్యామ్ విషయంలో బడ్జెట్ కంట్రోల్ ఉందనే టాక్ ఉంది.

అయితే తాజాగా రాధేశ్యామ్‌కి తగ్గిన ప్రభాస్ తన తదుపరి చిత్రాల విషయంలో మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయబోయే ఆదిపురుష్ సినిమాకి 500 కోట్ల బడ్జెట్ పెట్టడానికి టి సీరీస్ రెడీగా ఉందట. అమ్మో ఒక టాలీవుడ్ స్టార్ మీద బాలీవుడ్ నిర్మాతలు ఈ రేంజ్ బడ్జెట్ పెడితే.. ఇండియా నెంబర్ వన్ ప్రభాస్ అనేవారు. కానీ ఇప్పుడు ఆదిపురుష్ బడ్జెట్ కి మించి నాగ్ అశ్విన్ - అశ్విని దత్ ల సినిమా ఉండబోతుంది. ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమాకి వైజయంతి వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ లెక్కలు వేస్తున్నారని టాక్ కాదు నిజమే అని నిర్మాత చెప్పడంతో.. ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ తో ప్రభాస్ బడ్జెట్ పరంగా రికార్డును సృష్టిస్తే.. మళ్ళీ ప్రభాస్ రికార్డును బడ్జెట్ ని ప్రభాసే బద్దలు కొట్టేస్తున్నాడంటూ తెగ ఇదైపోతున్నారు. మరి వైజయంతి మూవీస్ వారు ప్రభాస్ మీద 600 కోట్లు పెట్టి ఎలాంటి సినిమా తియ్యబోతున్నారో అనే దాని మీద ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీ మాములుగా లేదు.

This is Prabhas Craze at Box Office:

Prabhas Creates records at Indian cinema

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ