Advertisementt

వేరే ఆప్షన్ లేదు.. నాగ్ చెప్పిందల్లా చేయడమే!

Fri 30th Oct 2020 08:56 PM
nagarjuna,ruling,bigg boss,samantha,bigg boss host,star maa  వేరే ఆప్షన్ లేదు.. నాగ్ చెప్పిందల్లా చేయడమే!
Only Nag.. No option to Star Maa about Bigg Boss వేరే ఆప్షన్ లేదు.. నాగ్ చెప్పిందల్లా చేయడమే!
Advertisement
Ads by CJ

స్టార్ హీరోలు తెలుగులో బిగ్ బాస్ చేస్తే స్టార్ మా యాజమాన్యం ఎంతివ్వడానికైనా రెడీగా ఉంది. కానీ సెకండ్ సీజన్ దెబ్బకి ఏ హీరో బిగ్ బాస్ హోస్ట్ గా రావడానికి సిద్ధపడడం లేదు. సీజన్ 2లో కంటెస్టెంట్స్ చేతిలో, బిగ్ బాస్ చేతిలో హీరో నాని నలిగిపోవడమే కాదు.. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యాడు. ఆ దెబ్బకి స్టార్ హీరోలు బిగ్ బాస్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక మూడో సీజన్ హోస్ట్‌గా వచ్చిన నాగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని, యాజమాన్యాన్ని కంట్రోల్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టే నాగార్జున ఏం అడిగినా బిగ్ బాస్ యాజమాన్యం ఇవ్వడానికి రెడీగా ఉంది. గత సీజన్‌లో పుట్టినరోజు పేరుతో మరో హోస్ట్‌ని తెచ్చి తాను విదేశాలకు చెక్కేశాడు నాగ్.

అసలు బిగ్ బాస్ కండిషన్స్ ఒప్పుకున్నాక హోస్ట్‌కి ఎన్ని పనులున్నా తన హోస్టింగ్ చెయ్యాల్సిందే. కానీ నాగ్ అలా కాదు.. వెకేషన్స్, షూటింగ్ అంటూ బిగ్ బాస్‌కి హ్యాండ్ ఇవ్వడం ఆయన చెప్పిన గెస్ట్ బిగ్ బాస్ స్టేజ్ మీద నిలబెట్టడం జరిగింది. తాజాగా నాగార్జున రెండు వారాలు అంటే నాలుగు ఎపిసోడ్స్ కి బిగ్ బాస్ కి బై బై చెప్పాడు. కారణం సినిమా షూటింగ్. అందుకే కోడలు సమంతని హోస్ట్ గా తెచ్చాడు. బిగ్ బాస్ యాజమాన్యం నాగ్ చెప్పింది విన్నారు. సమంత ఎలా హోస్ట్ చేస్తుందో అని ముందు భయపడినా.. ఎలాగోలా హ్యాండిల్ చేసింది. నాలుగు ఎపిసోడ్స్‌లో ఒకటి స్కిప్ చెయ్యగా ఒకటి మాత్రం సక్సెస్ ఫుల్‌గా కానిచ్చేసింది.

ఇక మిగతా రెండు ఎపిసోడ్స్‌కి సమంతానే హోస్ట్ అని తెలుస్తుంది. ఇక నాగార్జున చెప్పింది బిగ్ బాస్ వినడానికి మరో కారణం. నాగ్ స్టార్ మా లో భాగస్వామీ కావడం, అలాగే బిగ్ బాస్ హోస్ట్ గా కంటెస్టెంట్స్‌ని కంట్రోల్‌లో పెట్టే విషయంలో నాగ్‌కి మరెవరు సాటి రారు. అందుకే నాగార్జున ఏం చెప్పినా చెయ్యడానికి బిగ్ బాస్ రెడీ అవుతుంది. అయితే బిగ్ బాస్ హోస్ట్ మారడం వలన టీఆర్పీస్‌లో ఏమన్నా తేడాలొచ్చే అవకాశం ఉందేమో చూడాలి.

Only Nag.. No option to Star Maa about Bigg Boss:

Nag ruling the Bigg Boss 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ