ప్రస్తుతం తెలుగులో రష్మిక - పూజ హగ్దే ల పేర్లు మార్మోగిపోతున్నాయి. స్టార్ హీరోలు పాన్ ఇండియా ఫిలిమ్స్ తో వీళ్ళిద్దరిని టాప్ రేంజ్ కి తీసుకెళుతున్నారు. పూజ హెగ్డే రాధేశ్యాం తో పాన్ ఇండియా లో అడుగుపెడుతుంటే.. రష్మిక అల్లు అర్జున్ పుష్ప తో పాన్ ఇండియా కి వెళుతున్నది. అయితే పూజ హెగ్డే పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నప్పటికీ... మీడియా రేంజ్ హీరోలతో జోడి కడుతుంది. కారణం ఆమె కిచ్చే పారితోషకమే. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నటిస్తున్న పూజ హెగ్డే కి అత్యధిక పారితోషకం ఇస్తున్నారనే టాక్ ఉండగా.. ఇప్పుడు రష్మిక పుష్ప పాన్ ఇండియా మూవీ చేస్తూనే తెలుగులో మీడియం హీరో శర్వానంద్ తో ఆడాళ్ళు మీకు జోహార్లు మూవీ కి ఓకె చెప్పింది.
మరి పాన్ ఇండియా రేంజ్ నుండి మీడియం రేంజ్ హీరోతో సినిమా అంటే రష్మిక రేంజ్ బాగా పెరుగుతుంది. ఆమె సినిమాలో ఉంటే సినిమాకి క్రేజ్ వస్తుంది. అందుకే శర్వా టీం రష్మిక ని పట్టుకుంది. అయితే రష్మిక కూడా ఊరికే శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాకి ఓకె చెప్పలేదు. ఆ సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిందట. అంటే శర్వానంద్ సినిమాలో నటించడానికి రష్మిక పారితోషకం విషయంలో బేరానికి దిగింది అని.. అది తన కెరీర్ లోనే అత్యధిక పారితోషకం డిమాండ్ చేసింది అని.. అంటున్నారు. ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాకి రష్మిక పారితోషికం ఇంచుమించుగా.. 1.75 కోట్ల వరకూ ఉంటుందని ఫిల్మ్నగర్ టాక్. మరి రశ్మికకి హైట్, అందం, ఆకర్షణ లేకపోయినా లక్కీ గా ఆఫర్స్ పట్టడమే కాదు.. ఇప్పుడు నిర్మాతలను డిమాండ్ చేసి పారితోషకం పెంచుకునే స్థాయిలో రష్మిక ఉంది. కాబట్టే ఆమె ఆటలు చెల్లుతున్నాయ్ అంటున్నారు.