Advertisementt

ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలకు రాజమౌళి అల్టిమేటం జారీ!

Thu 29th Oct 2020 01:40 PM
ram charan,ntr,rajamouli,rrr movie,rajamouli warning  ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలకు రాజమౌళి అల్టిమేటం జారీ!
SS Rajamouli warning to RRR Heroes ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలకు రాజమౌళి అల్టిమేటం జారీ!
Advertisement
Ads by CJ

రాజమౌళితో చేస్తున్న RRR కోసం ఎన్టీఆర్ - రామ్ చరణ్‌లు సిక్స్ ప్యాక్ కాదు... అంతకు మించి బాడీ షేప్‌లోకి మారారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా అదరగొట్టేస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి లుక్, ఎన్టీఆర్ కొమరం భీం లుక్ రెండు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. అయితే RRR కోసం అల్లూరి లుక్‌ని, ఎన్టీఆర్ కొమరం భీం లుక్‌ని ఇప్పటికి అలానే మెయింటింగ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో రామ్ చరణ్ అయితే హెయిర్ అండ్ గెడ్డం పెంచినా ఎన్టీఆర్ మాత్రం కొమరం భీం లుక్‌నే ఫాలో అయ్యాడు. ఇక ప్రస్తుతం RRR షూటింగ్ మొదలవడం హీరోలు సెట్స్ మీద కెళ్ళడం జరిగింది. ఇక చరణ్ అల్లూరి లుక్‌ని, ఎన్టీఆర్ కొమరం భీం లుక్‌ని వీడియోస్‌తో బయటపెట్టి ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌ని కూల్ చేశాడు జక్కన్న.

ఇక జక్కన్న RRR సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది. ఎప్పుడు సినిమాని విడుదల చేస్తామని క్లారిటీ ఇవ్వడం లేదు. ఏమంటే కరోనా అంటున్నాడు. దానితో ఎన్టీఆర్ - చరణ్ ఫ్యాన్స్ ఇద్దరూ రాజమౌళి RRR విడుదల ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ఇద్దరి హీరోలకు ఓ కండిషన్ పెట్టాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. అది RRR షూటింగ్ పూర్తయ్యి.. హీరోలు ఫ్రీ అయినా మీరు గెటప్స్ చేంజ్ చెయ్యడానికి వీలు లేదు... నా సినిమా విడుదల వరకు అల్లూరి, భీం గెటప్స్ లోనే మీరుండాలి అంటూ చరణ్ - ఎన్టీఆర్‌లకి అల్టిమేటం జారీ చేశాడట.

ఎందుకంటే దేశ విదేశాల్లో RRR సినిమా ప్రీ రిలీజ్ పబ్లిసిటీ ఓ రేంజ్ లో ఉండాలని.. ఆ పబ్లిసిటీకి హీరోలిద్దరూ కొమరం భీం, అల్లూరి గెటప్స్ లోనే ఉండాలని.. అప్పుడే సినిమాకి క్రేజ్ వస్తుందని.. సో మీరు షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ అయ్యాకే గెటప్స్ చేంజ్ చెయ్యాలని చెప్పాడట. అంటే హీరోలు RRR పూర్తయినా సినిమా విడుదలయ్యే వరకు తమ తదుపరి సినిమాల కోసం గెటప్స్ చేంజ్ చెయ్యడానికి లేదన్నమాట.

SS Rajamouli warning to RRR Heroes:

SS Rajamouli conditions to Jr NTR and Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ